జగిత్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొలువుల జాతర: కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం, స్వీట్లు పంచి సెలబ్రేషన్స్

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో ఉద్యోగాల జాతరకు సంబంధించి అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. దీంతో నిరుద్యోగులు, టీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. కొలువుల భర్తీ కీలక ప్రకటన అని చెబుతున్నారు. ఎక్కడికక్కడ పాలాభిషేకాలు చేసి.. స్వీట్లు పంచుకుంటూ సందడి చేశారు. ఓయూలో సంబరాలు మిన్నంటిన సంగతి తెలిసిందే. జగిత్యాల జిల్లాలో కూడా సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి.

Recommended Video

Telangana Job Notifications: ఎన్నికల టైం CM KCR Big Announcement | Assembly Sessions |OneindiaTelugu

80 వేల ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు ప్ర‌క‌టించ‌డంతో సీఎం కేసీఆర్‌కు విద్యార్థులు, నిరుద్యోగులు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నారు. ఉద్యోగ అభ్య‌ర్థుల‌ను దృష్టిలో ఉంచుకుని వ‌యో ప‌రిమితి పెంచ‌డం ప‌ట్ల కూడా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. అసెంబ్లీలో ఉద్యోగ నియామకాలపై సీఎం కేసీఆర్ ప్రకటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల సంబురాలు అంబరాన్నంటాయి. నేటి నుంచే నోటిఫికేషన్లు వెలువడుతాయని ప్రకటించడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తూ పటాకులు కాలుస్తూ, స్వీట్లు పంచుతూ, సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ సంబురాలు జరుపుకున్నారు.

trs workers celebration at gandhi statue

రాష్ట్రం ఏర్పడింది నీళ్ల, నిధులు, నియామకాల కోసం.. ఇప్పుడు కొలువుల కోసం భారీ నోటిఫికేషన్ వెలువడింది. దీంతో గులాబీదళం ఫుల్ జోష్‌లో ఉంది. మెట్ పల్లి మండలం వేంపేటలో ఆ పార్టీ శ్రేణులు హడావిడి చేశారు. గాంధీ విగ్రహాం వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తర్వాత అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. కేసీఆర్ జిందాబాద్ అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మారు సాయిరెడ్డి, మెట్‌పల్లి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు నల్ల తిరుపతి రెడ్డి, ఎంపీటీసీ పుల్ల శేఖర్ గౌడ్ టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు తిప్పిరెడ్డి రమేష్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మారు నరేందర్, వెల్మల ముత్యం రెడ్డి, నల్ల జనార్థన్, మ్యాదరి దుర్గయ్య, పల్లి చొక్కాగౌడ్, కొట్టాల శ్రీనివాస్, పెంటపర్తి గంగారాజం తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు సంబ‌రాల్లో మునిగితేలుతున్నారు. హైద‌రాబాద్‌లోని తెలంగాణ భవన్ కు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు త‌ర‌లివ‌చ్చారు. నిరుద్యోగ బంధు కేసీఆర్ అంటూ టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాల వ‌ద్ద‌ ఫ్లెక్సీలు పెట్టారు. ప‌లు జిల్లాలలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్నారు.

English summary
trs workers celebration at gandhi statue. cm kcr announced jobs
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X