జగిత్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కార్యకర్తకు అండగా నేత, అకాల మృతితో ఆర్థిక సాయం, నేనున్నానని భరోసా

|
Google Oneindia TeluguNews

ఈ కాలంలో అన్నీ ఆర్థిక సంబంధాలే. ఉన్నప్పుడు పని చేయించుకోవడం.. లేరనుకో వదిలేయడం ఇప్పుడు సాధారణమే.. అవును రాజకీయ నేతలు/ ఇతరులు దాదాపుగా పట్టించుకోరు. కానీ తమ సోదర సమానుడు చనిపోయారని నేత చలించారు. చనిపోయిన అతని కులానికి చెందిన వారు కూడా రియాక్ట్ అయ్యారు. తలా ఇంత వేసుకొని.. ఉన్న ఒక్క తల్లికి ఆర్థిక సాయం చేశారు. చనిపోయిన అతనిని తీసుకురాలేమని.. కానీ తాము చేసే సాయం మాత్రం భరోసా ఇస్తుందని చెబుతున్నారు.

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వేంపేటలో మగ్గిడి రాహుల్ (25) గత శనివారం అనారోగ్యంతో చనిపోయాడు. ఎంతో భవిష్యత్ ఉన్న అతను తిరిగిరానీ లోకాలకు వెళ్లి.. తల్లికి కడుపుకోత మిగిల్చాడు. అతనికి తల్లి.. ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. వారికి పెళ్లి కాగా.. తల్లితో కలిసి ఉండేవాడు. ఏడాది క్రితం అతని తండ్రి కూడా అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో కుటుంబానికి రాహులే పెద్ద దిక్కు.. కానీ అతను కూడా చనిపోయి.. తల్లికి గుండెకోతను మిగిల్చాడు.

worker rahul died recetly due to unwell. leader rajeshwar reddy helped his family.

Recommended Video

BJP Former MP Rapolu Ananda Bhaskar Appeals PM Modi | Oneindia Telugu

అంతకుముందు స్థానిక అధికార పార్టీ నేత కొమ్ముల రాజేశ్వర్ రెడ్డి వద్ద పనిచేసేవాడు. ఏ పని అన్న చేసేవాడు. రాహుల్ హఠాన్మరణంతో.. రాజేశ్వర్ రెడ్డి చలించిపోయారు. అతని తల్లిని గురువారం మాల కుల పెద్దల సమక్షంలో పరామర్శించారు. రూ.12 వేల నగదు అందజేసి.. ధైర్యంగా ఉండాలని రాహుల్ అమ్మకు చెప్పారు. రాజేశ్వర్‌తోపాటు ఉప సర్పంచ్ గోరుమంతుల ప్రవీణ్, మగ్గిడి ప్రశాంత్, మగ్గిడి నారాయణ, మగ్గిడి నందు, గోరుమంతుల నరేశ్, ఆకుల రాజు, గన్యారపు భూమేశ్వర్, బలిజే బాబయ్య తదితరులు ఉన్నారు.

English summary
worker rahul died recetly due to unwell. leader rajeshwar reddy helped his family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X