జోష్ - ఆర్టియమ్ అకాడెమీ నుంచి Bharat ka sur గీతావిష్కరణ: వీడియో వావ్..!
బెంగళూరు: భారత్‌లో అతివేగంగా విస్తరించి సామాన్యులకు సైతం చేరువైన షార్ట్ వీడియో యాప్ జోష్. ఇక ఆన్‌లైన్ మ్యూజిక్ ఎడ్యుకేషన్‌కు వేదికైన ఆర్టియమ్ అకాడెమీతో జతకట్టి దేశంలోనే అతిపెద్ద UGC( యూజర్ జనరేటెడ్ కంటెట్) గీతాన్ని ఆవిష్కరించింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో భాగంగా ఈ పాటను జోష్ మరియు ఆర్టియమ్ అకాడెమీలు విడుదల చేశాయి.
#Bharatkasur ప్రచారంలో భాగంగా ఈ గీతం పుట్టుకొచ్చింది. ఈ గీతాన్ని సక్సెస్ చేసేందుకు దేశపౌరులు, క్రియేటర్లు, ఆర్టిస్టులు, సంగీత కళాకారులు ఒకే తాటిపైకొచ్చారు. 15 రోజుల పాటు జోష్ పై క్యాంపెయిన్ జరిగింది.ఈ క్యాంపెయిన్‌కు మంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. 18వేలకు పైగా వీడియోలను క్రియేట్ చేశారు క్రియేటర్స్ మరియు యూజర్స్. ఈ భారీ సంఖ్యలో వచ్చిన వీడియోల నుంచి కొన్ని అత్యుత్తమ వీడియోలను సెలెక్ట్ చేయడం జరిగింది.ఆ తర్వాత ఈ వీడియోలను ప్రత్యేకంగా రూపొందించిన గీతంలో కూర్చడం జరిగింది. ఈ వీడియో ద్వారా దేశంలోని విభిన్నమైన టాలెంట్‌ను వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అదే సమయంలో దేశపౌరులు భిన్నత్వంలో ఏకత్వం గురించి చెప్పడం జరిగింది.ఇక ఈ గీతం దేశ స్ఫూర్తిని చాటుతూ, మన దేశ సంస్కృతిలో అంతర్భాగమైన సంగీతం ప్రతిధ్వనిస్తుంది.

ఆర్టియమ్ అకాడెమీకి చెందిన టీచర్ల బృందం ఈ గీతాన్ని ఆలపించింది. వీరు సంగీతంలో ప్రావీణ్యత పొందినవారు కావడం విశేషం.వీరిలో కొందరు జోష్ యాప్ పై కూడా తమ టాలెంట్‌ను ప్రదర్శించారు. భారత దేశ స్ఫూర్తిని చాటిన ఈ వీడియో నిడివి 4 నిమిషాల 30 సెకన్లు ఉంది. మొత్తం 12 భారతీయ భాషల్లో ఈ గీతాన్ని ఆలపించడం జరిగింది. బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మళయాలం, మరాఠీ, డోగ్రీ, తమిళం, తెలుగు, భోజ్‌పురి, రాజస్థానీ, పంజాబీ భాషల్లో ఈ గీతాన్ని పాడారు.
"ఆర్టియమ్ అకాడెమీతో జోష్ జత కట్టి భారత్ కా సూర్ అనే ఈ గీతాన్ని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ గీతం ద్వారా క్రియేటర్లు, సంగీత కళాకారుల టాలెంట్ ప్రపంచానికి పరిచయం అయ్యింది. అతి పెద్ద స్థాయిలో తొలిసారిగా ఒక యూజీసీ గీతాన్ని భారత్‌లో క్రియేట్ చేయడం జరిగింది. యూజర్లు, ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు చాలా థ్రిల్‌గా ఫీలవుతున్నాను. మా జోష్ ప్లాట్‌ఫాంపై క్రియేటర్ కమ్యూనిటీ ఎన్నో అద్భుతాలు సృష్టిచగలదు అని మరోసారి రుజువు చేయడమే కాదు #Bharatkasur క్యాంపెయిన్ ఒక సాక్ష్యంగా నిలిచింది. అంతేకాదు చక్కటి నైపుణ్యతను ప్రదర్శించేందుకు, నేర్చుకునేందుకు, వృద్ధి చెందేందుకు జోష్ ఒక చక్కటి వేదికగా మారుతోంది " అని జోష్ హెడ్ ఆఫ్ క్రియేటర్ అండ్ కంటెంట్ ఎకోసిస్టం సుందర్ వెంకట్రామన్ తెలిపారు.
" సంగీతంపై మక్కువ ఉన్నవారు, నేర్చుకోవాలనే తపన ఉన్నవారిని టెక్నాలజీ మరియు మీడియా భాగస్వామ్యంతో ఒకటి చేయాలనే ప్రయత్నం చేస్తోంది ఆర్టియం అకాడెమీ.Bharatkasur అనే ఒరిజినల్ ట్రాక్ ద్వారా దేశ నలుమూలల నుంచి టాలెంట్ వెలికితీసే క్రమంలో జోష్‌తో జతకట్టడం చాలా ఆనందంగా ఉంది.ఇద్దరం కలిసి క్రియేటర్లను ప్రోత్సహిస్తూ ఇదొక పీపుల్స్ క్యాంపెయిన్‌గా చేయాలని భావిస్తున్నాం" అని ఆర్టియమ్ అకాడెమీ సహవ్యవస్థాపకులు వివేక్ రైచా చెప్పారు.
జోష్ యాప్‌తో పాటు ఈ గీతం డైలీహంట్ ప్లేయర్‌పై మరియు ఆర్టియమ్ ఒరిజినల్స్ ఛానెల్ పై కూడా వీక్షించొచ్చు.
ఈ క్యాంపెయిన్ సక్సెస్ అయ్యేందుకు ఢిల్లీపోలీసులు, మిరాజ్ సినిమాస్, సహకరించారు.అంతేకాదు ఎంటీవీ, డైలీహంట్, వన్ ఇండియా, టీ-సిరీస్, సంగీత్ బంగ్లా, ఫిల్మీ బీట్, రెడ్ ఎఫ్‌ఎం,దివ్యాంగ్‌జన్ ఎంట్రప్రెన్యూర్ అసోసియేషన్, సురమ్య లైఫ్ ఫౌండేషన్, దమ్రూ, పంజాబీ హిట్స్, తబ్బార్ హిట్స్, లివింగ్ ఇండియా న్యూస్, ఐబీసీ & సినీఉలగం,షార్ట్‌ఫ్లిక్స్, దివో, బ్రాడ్‌వే, ఇన్‌ఫ్లూ,ఫ్యాక్ట్ బులెటిన్ న్యూస్, మ్యూజిక్ ఎంపైర్, వీటీవీ గుజరాతి, ది పాలిటిక్స్, ఆనంద్ ఆడియో, ఎంఏడీ, వీఎం, క్రేజ్ ఎంట్రెప్రెన్యూర్స్, అనవరన మూవీ కూడా భాగస్వాములుగా ఉన్నారు.
జోష్ గురించి:
ఆగష్టు 2020లో వెర్సె ఇన్నోవేషన్ సంస్థ జోష్ అనే షార్ట్ వీడియో యాప్‌ను మేడిన్ ఇండియాలో భాగంగా ప్రపంచానికి పరిచయం చేసింది.భారత్‌లోని టాప్ 1000 బెస్ట్ క్రియేటర్లు, 20000తో కూడిన బలమైన క్రియేటర్ కమ్యూనిటీ,10 అతిపెద్ద మ్యూజిక్ లేబుల్స్,15 మిలియన్‌కు పైగా యూజీసీ క్రియేటర్లు, బెస్ట్ క్లాస్ కంటెంట్ క్రియేషన్ టూల్స్,వినోదం, యూజర్ డెమొగ్రాఫిక్స్‌లాంటి అంశాలతో జోష్ యాప్ రూపుదిద్దుకుంది.ప్లే స్టోర్ పై జోష్ ప్రతి సారి స్థిరమైన ఇండియన్ షార్ట్ వీడియో యాప్‌గా గుర్తింపు పొందింది.100 మిలియన్‌కు పైగా డౌన్‌లోడ్స్ అవుతున్నాయి.భారత్‌లో అతి వేగంగా విస్తరిస్తున్న షార్ట్ వీడియో యాప్ జోష్. జోష్‌కు 153 మిలియన్ నెలవారీ యాక్టివ్ యూజర్లు (MAU),74 మిలియన్ రోజువారీ యాక్టివ్ యూజర్లు (DAU) ఉండగా, సగటున 23 నిమిషాలు యూజర్లు యాప్‌పై సమయం కేటాయిస్తున్నారు.
ఆర్టియం అకాడెమీ గురించి:
ఆర్టియం అకాడెమీ అనే సంస్థ భారత్‌లోనే అతిపెద్ద సంగీత వేదిక.ఇక్కడ సంగీతం నేర్పించడం కోసం పలు కోర్సులను ప్రవేశపెట్టింది. ఈ కోర్సులన్నీ దేశంలోని లెజెండరీ సంగీతకళాకారులు సర్టిఫై చేశారు.ఆన్‌లైన్ క్లాసుల ద్వారా అత్యత్తమమైన టీచర్లచే బోధన ఉంటుంది.అది కూడా 1:1 నిష్పత్తితో ఉంటుంది.లైవ్‌తో పాటు ఇంటరాక్టివ్ మాస్టర్ క్లాసెస్‌ను మ్యూజిక్ మాస్ట్రోలతో ఉంటుంది. అంతేకాదు పెద్దఎత్తున రికార్డ్ కంటెంట్ అందుబాటులో ఉంటుంది. ఆర్టియం వోకల్స్ మరియు ఇన్స్‌ట్రుమెంట్స్ రెండిటీకి సంబంధించిన పనితీరు ఆధారిత కోర్సులను లెజెండ్స్ అయిన సోనూ నిగమ్, కేఎస్ చిత్ర, శుభ ముద్గల్,అరుణ సాయిరామ్, లూయిస్ బ్యాంక్స్, రాజు సింగ్,గినో బ్యాంక్స్, అనీష్ ప్రధాన్, అనంత్ వైద్యనాథన్‌లు ఆర్టియమ్స్ అకాడెమిక్ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది.
ఆర్టియంకు చెందిన ప్రొప్రెటరీ టెక్ ద్వారా పాఠాలు బోధిస్తారు.వీడియో కాన్ఫరెన్స్ పద్ధతి ద్వారా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పద్ధతి ద్వారా,ప్రత్యకంగా డిజైన్ చేసిన టూల్స్ ద్వారా పాఠాలు బోధించబడుతాయి. ఇప్పటికే ఆర్టియం సంస్థలో కొన్ని వందల్లో సర్టిఫైడ్ టీచర్లు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేలమంది పెయిడ్ లెర్నర్స్ ఉన్నారు. వీరంతా ఆర్టియం టాలెంట్ వేదికను వినియోగించుకుని ఒరిజినల్ మ్యూజిక్‌ను విడుదల చేస్తారు. ఇప్పటి వరకు 15కు పైగా పాటలను విడుదల చేయగా యూట్యూబ్‌పై కొన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications