పులివెందులలోనే బొటాబోటీ మెజార్టీ, మరీ మిగతా చోట్ల: బీజేపీ నేత సత్యకుమార్ విసుర్లు
పులివెందులలో సీఎం జగన్‌కు కేవలం 51 శాతం మాత్రమే మద్దతు ఉందట. ఇదే విషయాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వై సత్యకుమార్ తెలిపారు. అంతేకాదు ఈ విషయం తాను చెబుతోంది కాదని చెప్పేశారు. వైసీపీకి పీకే బృందం చేసిన సర్వేలో తేలిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ చేపట్టిన ప్రజాపోరులో పాల్గొన్నారు.
సొంత నియోజకవర్గంలో సీఎం జగన్ బొటాబొటీ మెజారిటీతో బయటపడుతాడని తెలిపారు.మరీ రాష్ట్రంలో 175 సీట్లలో గెలవాలని పార్టీ నేతలకు నిర్దేశం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యేలను గడపగడపకు వెళ్లమని చెబుతున్న జగన్... తాను మాత్రం తన సొంత నియోజకవర్గంలో ఎందుకు తిరగడం లేదని ప్రశ్నించారు.

జగన్ కూడా ఎమ్మెల్యేల మాదిరే తన నియోజకవర్గంలో పర్యటించాలని సూచించారు. పులివెందుల ప్రజల బాగోగులను స్థానిక ఎమ్మెల్యే తప్ప మరెవరు పట్టించుకుంటారని అడిగారు. ఇటీవలే నిషేధిత సంస్థల జాబితాలోకి వెళ్లిపోయిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)తో వైసీపీని పోల్చారు. నిషేధిత పీఎఫ్ఐ, వైసీపీ రెండూ ఒకటేనన్నారు. రెండింటివీ విధ్వంసకర ఆలోచనలేనని ఆరోపించారు. పాలనలో వైసీపీ విధ్వంసకర ఆలోచనలతో ముందుకు సాగుతోందని హాట్ కామెంట్స్ చేశారు.
ఏపీలో బీజేపీ జనసేన కలిసి ఎన్నికలకు వెళతాయట. మిగతా పార్టీలతో తమకు పొత్తులేదని ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ ఇదివరకే స్పష్టంచేశారు. టీడీపీతో బీజేపీ కలిసి బరిలోకి దిగుతుందనే ఊహాగానాల నేపథ్యంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.












Click it and Unblock the Notifications