మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు: మాటలే లేవు..సహకరిస్తారా..!
కడప జిల్లాలో పోటీ చేసే అభ్యర్దుల పై టిడిపి అధినేత కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కొంత కాలంగా తెగని పంచాయితీగా ఉన్న జమ్మలమడుగు ఎమ్మెల్యే..కడప ఎంపీ గా ఎవరు పోటీ చేయాలనే దాని పైనా నిర్ణయం తీసుకున్న ట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో కమలాపురం అభ్యర్ధి విషయంలోనూ చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చారు.

ఇష్టం లేకపోయినా..బరిలోకి ఆది..!
జమ్మలమడుగు ఎమ్మెల్యేగా వైసిపి నుండి గెలిచి ఆ తరువాత టిడిపిలో చేరి మంత్రి అయిన ఆది నారాయణ రెడ్డి కడప టిడిపిలో కీలకంగా మారారు. వచ్చే ఎన్నికల్లో ఆది నారాయణ రెడ్డికి ఇబ్బంది లేకుండా ఉండటానికి స్థానిక టిడిపి సీనియ ర్ నేత మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. దీంతో..తమకు ఇక వచ్చే ఎన్నికల్లో సీటు గ్యారంటీగా రామ సుబ్బారెడ్డి వర్గీయులు భావించారు. అయితే, కొద్ది రోజులుగా కడప ఎంపి..జమ్మల మడుగు ఎమ్మెల్యే సీటు ఈ ఇద్దరి నేతలతో ముఖ్యమంత్రి అనేక సార్లు సమావేశాలు నిర్వహించారు. మీ ఇద్దరిలోనే ఎవరు ఎక్కడ నుండి పోటీ చేస్తారో తేల్చుకోవాలని సూచించారు. అయితే, ఇద్దరూ తమకు జమ్మలమడుగు అసెంబ్లీ సీటు కావాలంటూ పట్టుబట్టారు. దీంతో..నిర్ణయాన్ని ముఖ్యమంత్రికే వదిలేసారు. సీయం ఎలా చెబితే అలా నడుచుకుంటా మని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే మంతి ఆదినారయణ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీగా బరిలోకి దించాలని సీయం తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

జమ్మల మడుగు ఆయనకే..
జమ్మలమడుగు అసెంబ్లీ సీటు కోసం స్థానికంగా సుదీర్ఘ కాలంగా వైరి వర్గాలుగా ఉన్న రామసుబ్బారెడ్డి..ఆది నారాయణ రెడ్డి ఇద్దరూ చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేసారు. ముఖ్యమంత్రి పై ఒత్తిడి తెచ్చారు. తమ సోదరులు..అనుచ రులు జమ్మలమడుగు నుండే పోటీ చేయమని ఒత్తిడి తెస్తున్నారని ఆది నారాయణ రెడ్డి సీయం కు వివరించారు. ఇక, జమ్మలమడుగు లో తానే పోటీ చేస్తానంటూ రామ సుబ్బారెడ్డి చెబుతూ వచ్చారు. ప్రస్తుతం ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం..ఇంకా ఆ పదవికి సమయం ఉండటంతో తమకే సీటు ఇవ్వాలని ఆది నారాయణ రెడ్డి పట్టుబట్టారు. అయితే,
దీని పై విస్తృత కసరత్తు తరువాత ముఖ్యమంత్రి ఓ నిర్ణయానికి వచ్చారు. ఎంపీగా ఆదినారయణ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యేగా రామ సుబ్బారెడ్డిని బరిలోకి దింపాలని నిర్ణయించారు. సీయం కే తుది నిర్ణయం వదిలేయటంలో ఆయన తీసుకున్న నిర్ణయం పై మంత్రి ఆది నారాయణ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.

మాటలే లేవు..సహకారం సాధ్యమా..
ఇద్దరూ ఒకే పార్టీలో ఉంటున్నా..సుదీర్ఘ వైరం కారణంగా ఇప్పటికీ రామసుబ్బారెడ్డి - ఆది నారాయణ రెడ్డి మధ్య కీనీస మాటలే లేవు. ఇద్దరూ సీయం ముందు పంచాయితీలో కూర్చున్నా..మాట్లాడుకున్న సందర్భాలు లేవు. కడప ఎంపీగా పోటీకి ఆది నారాయణరెడ్డిని దింపటం ద్వారా సొంత నియోజకవర్గంలో రామసుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని.. అయితే, ఎంపీగా జమ్మలమడుగు నుండి ఎక్కువ మెజార్టీ వచ్చేలా చూడాల్సిన బాధ్యత రామసుబ్బారెడ్డిదే నని పార్టీ స్పష్టం చేస్తోంది. అయితే, ఈ ఇద్దరి వైరం కారణంగా ఎమ్మెల్యేగా రామసుబ్బారెడ్డికి అసెంబ్లీ ఎన్నికల్లో ఆది నారాయణ రెడ్డి వర్గం.. అదే విధంగా ఎంపీగా ఆదినారాయణ రెడ్డికి రామసుబ్బారెడ్డి వర్గం ఎంత వరకు సహకరిస్తుందనేది సందే హంగానే ఉంటుంని విశ్లేషకుల అంచనా. ఇదే సమయంలో ఎంపీగా పోటీ చేసి ఫలితం ప్రతికూలంగా ఉంటే..శాసన మండలి సభ్యుడిగా అవకాశం ఇస్తామని టిడిపి అధినాయకత్వం హామ ఇస్తోంది. దీంతో..ఇప్పుడు ఈ నియోజకవర్గం ఎన్నిక..ఎత్తులు..వ్యూహాల పై ఆసక్తి నెలకొంది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications