రేపు పులివెందులకు జగన్..! ఢిల్లీలో బిజీబిజీగా ఏపి సీఎం..!!
Recommended Video
కడప/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు కడపలో పర్యటించబోతున్నారు. ఈ నెల 8న ఏపి సీఎం జిల్లా పర్యటనకు వస్తున్నట్లు కలెక్టరు హరికిరణ్ మంగళవారం ఒక ప్రకనటలో తెలిపారు. 8న ఉదయం 9.35 గంటలకు సీఎం కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలిక్యాప్టరులో బయలుదేరి 10.10కి పులివెందులోల ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరకుంటారు. 10.20కి అక్కడి నుంచి బయల్దేరి 10.30కి భాకరాపురం పాల కేంద్రానికి చేరుకుంటారు.
10.35 నుంచి 10.55 గంటల వరకు దివంగత మాజీ మంత్రి వైఎస్ వివకానందరెడ్డి విగ్రహావిష్కరణలో పాల్గొంటారు. అక్కడి నుంచి 11గంటలకు బయల్దేరి 11.15కు ఆర్‌అండ్‌బి అతిథి గృహానికి చేరుకుంటారు. 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై సమావేశం నిర్వహిస్తారు. 12.15 నుంచి 12.45 వరకు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి 12.50కి బయల్దేరి 12.55 నిమిషాలకు హెలిప్యాడ్ చేరుకుని ఒంటిగంటకు అనంతపురం జిల్లా పెనుగొండకు బయలుదేరుతారని కలెక్టర్ ప్రకటనలో తెలిపారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, నందిగం సురేష్, బాల శౌరి పాల్గొన్నారు. సుమారు అరగంట పాటు ఈ సమావేశం కొనసాగింది. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. ఇవాళ మధ్యాహ్నం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రితో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన నిధులపై చర్చించారు. కాగా నిన్న ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్...
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం 13వ షెడ్యూలులో పొందుపరిచిన హామీలన్నీ నెరవేర్చాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరిన విషయం తెలిసిందే. మంగళవారం పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో సాయంత్రం 4.35 గంటల నుంచి 5.20 వరకు 45 నిమిషాల పాటు ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై ముఖ్యమంత్రి ప్రధానికి వినతిపత్రం సమర్పించారు.












Click it and Unblock the Notifications