కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.5 లక్షలేనా.. రూ.25 లక్షలు ఇవ్వండి.. వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

|
Google Oneindia TeluguNews

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో గల ప్రజల సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలకు కడప జిల్లాలో గల అన్నమయ్య ప్రాజెక్ట్‌ తెగిపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన ఆరోపించారు. వరదల్లో మృతిచెందిన కుటుంబాలకు టీడీపీ తరపున రూ.లక్ష పరిహారాన్ని ప్రకటించారు. వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు రూ.5 వేల ఆర్థిక సాయాన్ని చంద్రబాబు అందించారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ప్రజల ప్రాణాలను బలి చేస్తున్నారని ఆరోపించారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలివ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

తీవ్రతను గుర్తించాల్సి ఉంది..

తీవ్రతను గుర్తించాల్సి ఉంది..


వర్షాలు, తుపాను ఎవరూ ఆపలేం అని చెప్పారు. వర్షాల తీవ్రతను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గేట్లు రిపేర్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదా? కోట్లాది రూపాయల మేర నష్టం జరిగేదా అని అడిగారు. ఈ స్థాయిలో నష్టపోతే ఏరియల్ సర్వే చేస్తారా? వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించకపోవడం దుర్మార్గం అని చంద్రబాబు నాయుడు తప్పుపట్టారు. ఓట్ల కోసం రోడ్లు పట్టుకుని తిరిగిన జగన్, సీఎం అయ్యాక ఏరియల్ సర్వేతో సరి పెట్టుకోవడం ఏంటీ అని అడిగారు.

రూ.5 లక్షలేనా..?

రూ.5 లక్షలేనా..?

పాలిమర్ ఘటన బాధితులకు కోటి రూపాయలు ప్రకటించిన సీఎం జగన్, సర్వస్వాన్ని కోల్పోయి నిరాశ్రయులుగా మారితే 5 లక్షల పరిహారమా? ఇదెక్కడి న్యాయం? మందపల్లిని దత్తత తీసుకుని అన్ని విధాల అభివృద్ధి చేస్తాం అని చెప్పారు. విశాఖ విపత్తులో నిద్ర పోకుండా సహాయక చర్యలు చేపట్టాం అని తెలిపారు. వారం రోజులు పాటు సహాయక చర్యలు చేపట్టి.. మాములు స్థితికి తెచ్చాం అని వివరించారు. సీఎం జగన్ మాత్రం కాలు బయటపెట్టకుండా హెలికాప్టర్ లో ఏరియల్ సర్వేతో సరిపెట్టుకున్నారు. ఇదేనా బాధ్యతంటే..? అని చంద్రబాబు ఫైర్ అయ్యారు.

Recommended Video

Weather : Heavy Rains Till Oct 17 Due To Low Pressure || Oneindia Telugu
3 రోజులు పర్యటన

3 రోజులు పర్యటన

వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు మూడు రోజులపాటు పర్యటిస్తారు. వరద బాధిత ప్రాంతాల పర్యటనలో భాగంగా చంద్రబాబు కడప జిల్లాలో పర్యటించారు. రాజంపేట, నందలూరు మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు. పులపత్తూరు, మందపల్లి, తోగూరుపేట, గుండ్లూరు గ్రామాల్లో బాధితులను పరామర్శించారు. వారితో మాట్లాడారు. ఇవాళ మొత్తం కడప జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు.. రేపు చిత్తూరు, ఎల్లుండి నెల్లూరు జిల్లాలకు వెళతారు.

English summary
tdp chief chandrababu naidu ask to government give 25 lakhs to flood affect people. today he visit kadapa district
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X