వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన.. మరికొన్ని గంటల్లో షురూ
ఏపీలో వర్షంతో వరద పోటెత్తిన సంగతి తెలసిందే. వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు పర్యటిస్తారు. నేట నుంచి ప్రభావిత ప్రాంతాలను చుట్టివేస్తారు. ఉదయం కడప, మధ్యాహ్నం తిరుపతిలో పర్యటిస్తారు. బుధవారం నెల్లూరులో కలియ తిరుగుతారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను పరామర్శిస్తారు.
రాయలసీమ, నెల్లూరు జిల్లాలో వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు సాయం చేయాలని పార్టీ శ్రేణులను ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వరద బాధితులకు ఆహారం, మందులు అందించాలని కోరారు. చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు అందించాలని సూచించారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌తో సమన్వయం చేసుకుని ఐటీడీపీ ద్వారా ఇప్పటికే ఆహారం, మందులు పంపిణీ చేయాలని తెలిపారు. టీడీపీ నేతలు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి ప్రజలను ఆదుకోవాలని చంద్రబాబు సూచనలు చేశారు.
అసెంబ్లీలో జరిగిన పరిణామాల తర్వాత.. వరద ప్రభావిత ప్రాంతాల నుంచే చంద్రబాబు యాక్షన్ మొదలుకాబోతోంది. ఇకపై.. ప్రజాక్షేత్రంలోనే ఉంటానని.. అసెంబ్లీలో శపథం చేసిన బాబు.. వరద ప్రభావిత జిల్లాల నుంచే జనంలోకి వెళ్లనున్నారు. ఇప్పటి నుంచి.. వచ్చే ఎన్నికల దాకా చంద్రబాబుతో పాటే టీడీపీ నాయకులు, కార్యకర్తలు జనంలో ఉండనున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో.. వరద బాధితులకు టీడీపీ శ్రేణులు అండగా నిలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

చిన్న పిల్లలకు పాలు, బిస్కెట్లు అందించాలని సూచించారు. ఇప్పటికే.. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ముంపు గ్రామాల్లో సహాయచర్యలు చేపట్టడంతో పాటు.. వరదలో చిక్కుకున్న వారికి మందులు, ఆహారం అందజేసినట్లు తెలిపారు చంద్రబాబు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో.. సహాయ సహకారాలు అందిస్తున్న వీడియోను టీడీపీ ట్వీట్ చేసింది. ముంపు ప్రాంతాల్లో.. టీడీపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహాయ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు.
Recommended Video
రాష్ట్రంలో ఎక్కడి సమస్యలపై.. అక్కడే పోరాడాలని తెలుగుదేశం నిర్ణయించుకుంది. చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా జనంలోనే ఉండేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ప్రజాక్షేత్రంలోనే.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని టీడీపీ నేతలకు.. పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.


Click it and Unblock the Notifications