వివేకా హత్యకేసులో నార్కో అనాలిసిస్ కు నలుగురు నిందితులు ... గుజరాత్ కు తరలింపు
వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బాబాయి, సీనియర్ పొలిటీషియన్ , మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది . ఇంత సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నా హంతకులు ఎవరు ? హత్యకు కారణం ఏంటి ? అన్నది మాత్రం సిట్ ఇంకా కనిపెట్టలేకపోయింది. ఎన్నికలకు ముందు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణంగా హత్యకు గురైనా ఇప్పటి వరకు ఎవరు ఎందుకు ఆయన్ను హత్య చేశారు అనేది మాత్రం మిస్టరీగానే మారింది .మార్చి 15, 2019 న వైయస్ వివేకాను కడపలోని తన పులివెందుల నివాసంలో దారుణంగా హత్య చేసిన కేసులో నిందితులు నోరు విప్పి నిజం చెప్పకపోవటంతో వారికి నార్కో అనాలిసిస్ పరీక్షలు చేయిస్తున్నారు సిట్ అధికారులు.

వివేకా హత్యే కేసులో వివేకా ముఖ్య అనుచరుడు పరమేశ్వర్ రెడ్డికి నార్కో అనాలిసిస్ పరీక్షలు
ఇక విచారణలో భాగంగా వివేకా హత్య కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న వివేకా ముఖ్య అనుచరుడైన గంగిరెడ్డికి, వాచ్ మ్యాన్ రంగయ్యకు, కిరాయి హంతకుడు శేఖర్ రెడ్డి కి నార్కో అనాలిసిస్ పరీక్షలను నిర్వహించటానికి కోర్టు అనుమతి ఇచ్చింది .ఇక వీరితో పాటు నాలుగు నెలల క్రితం కసునూరి పరమేశ్వర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు . వివేకా హత్య తర్వాత కనిపించకుండా పోయిన పరమేశ్వర రెడ్డిని సిట్ అధికారులు మార్చి నెలలో అరెస్ట్ చేశారు. కానీ అతని నుండి ఎలాంటి కీలక సమాచారం రాబట్టలేకపోయింది.

హత్య తర్వాత పరారైన పరమేశ్వర్ రెడ్డి ఆస్పత్రిలో చేరిక .. విచారణలో నోరు మెదపని పరమేశ్వర్ రెడ్డి
పరమేశ్వర్ రెడ్డిని తిరుపతిలోని సంకల్ప ఆసుపత్రిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివేకా ముఖ్య అనుచరుడు, ఆయనకు అత్యంత సన్నిహితుడైన పరమేశ్వర రెడ్డి హత్య తర్వాత కనిపించకుండా పోయారు. అదే రోజు అర్థరాత్రి ఆయన ఊరు విడిచి పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. గుండెపోటుతో సోమవారం తెల్లవారుజామున ఆయన ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. అయితే వివేకాకు ముఖ్య అనుచరుడైన పరమేశ్వర రెడ్డి రాత్రికి రాత్రే పరారవటం, గుండె నొప్పి రావటం, ఆయన అంత్యక్రియలకు కూడా రాకపోవడం వంటి కారణాలతో పోలీసులకు అనుమానం కలగటంతో ఆయనను నాలుగు నెలల క్రితం అరెస్ట్ చేశారు. ఇక ఆయనను విచారించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయనకు కూడా నార్కో అనాలిసిస్ పరీక్షలకు అనుమతి కోరింది సిట్. పరమేశ్వర్ రెడ్డి కి కూడా నార్కో అనాలిసిస్ , బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షలు చెయ్యటానికి కోర్టు ఆనుమతినిచ్చింది .

గుజరాత్ కు నలుగురు నిందితులను తరలించిన సిట్ పోలీసులు
కడపలోని పులివెందుల నివాసంలో మాజీ మంత్రి వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఈ నలుగురు నిందితులపై నార్కో ఎనాలిసిస్ టెస్ట్ నిర్వహించడానికి పులివెందుల సివిల్ కోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) అనుమతి ఇచ్చింది. ఈ నిందితులు గుజరాత్‌లో నార్కో ఎనాలిసిస్, బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇప్పటికే నిందితులను గుజరాత్‌కు పంపారు. నలుగురు నిందితులు గంగిరెడ్డి, కాపలాదారు రంగయ్య, శేఖర్ రెడ్డి, కొత్త నిందితుడు కసునూరు పరమేశ్వర్ రెడ్డి ల నార్కో పరీక్షల అనంతరం ఈ కేసులో కీలక పురోగతి కనిపించే అవకాశం వుంటుంది.












Click it and Unblock the Notifications