పంచాయతీ పోరు: మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అరెస్ట్.. శ్రేణుల ఆందోళన...

ఏపీలో పంచాయతీ పోరు హోరెత్తిస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రలోభాల పర్వానికి తెరలేచింది. డబ్బులు పంచగా.. అడ్డుకోవడమే ఇతర పార్టీ నేతల పనయిపోయింది. అయితే డబ్బులు పంచుతున్నారని తెలిసి వెళ్లిన మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈ ఘటన జరిగింది.

Recommended Video

    గుంటూరు: రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు... టీడీపీ నేత బైక్ ధ్వంసం

    కామనూరులో వైసీపీ మద్దతుదారులు డబ్బులు పంచుతున్నారని తెలిసింది. దీంతో అక్కడికి మాజీ ఎమ్మెల్యే వరద రాజుల రెడ్డి వెళ్లారు. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ప్రత్యర్థులతో వరదరాజుల రెడ్డికి వాగ్వాదం జరిగింది. వరదరాజులరెడ్డి దౌర్జన్యం చేశారని వైసీపీకి చెందిన నంద్యాల సరోజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వరదరాజుల రెడ్డిని అరెస్ట్ చేశారు.

    former proddatur mla varadarajulu reddy arrested in kamanur today

    విషయం తెలుసుకున్న వరదరాజుల రెడ్డి అనుచరులు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. వరదరాజుల రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డబ్బులు పంచుతున్నారని తెలిసి వెళితే.. చివరకు తమ నేతను అరెస్ట్ చేయడం ఏంటీ అని అడుగుతున్నారు. ఇదీ సరికాదు అని.. తీరు మార్చుకోవాలని పోలీసులను కోరారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+