కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఇలాకాలో వైసీపీలో ముసలం .. జమ్మలమడుగు వైసీపీ కౌన్సిలర్ రాజీనామా, ఎమ్మెల్యేపై ఆరోపణలు

|
Google Oneindia TeluguNews

కడప జిల్లా జమ్మలమడుగు వైసీపీలో విభేదాలు తలెత్తాయి. అసమ్మతి సెగలు రేగుతున్నాయి. తనకు పదవి రాకుండా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అడ్డుపడుతున్నారని వైసిపి కౌన్సిలర్ రాజీనామా చేసి సంచలన ఆరోపణలు చేయడం , బీసీలను, మహిళలను అవమాన పరిచారని వ్యాఖ్యానించడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో విభేదాలకు అద్దం పడుతుంది.

సీఎం జగన్ అధ్యక్షతన ఆ సమావేశానికి చంద్రబాబు .. సిఐడీ నోటీసుల తర్వాత ఇంట్రెస్టింగ్ సీఎం జగన్ అధ్యక్షతన ఆ సమావేశానికి చంద్రబాబు .. సిఐడీ నోటీసుల తర్వాత ఇంట్రెస్టింగ్

జమ్మలమడుగు మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఎంపిక రచ్చ .. వైసీపీ కౌన్సిలర్ రాజీనామా

జమ్మలమడుగు మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఎంపిక రచ్చ .. వైసీపీ కౌన్సిలర్ రాజీనామా

ఇంతకీ ఏం జరిగిందంటే కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఎంపిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో అసమ్మతికి ఆజ్యం పోసింది. జమ్మలమడుగు నాలుగో వార్డ్ లో గెలిచిన జ్ఞాన ప్రసూన ఈ ఉదయం తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. తనకు పదవి రాకుండా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అడ్డుపడుతున్నారని, మొదట తనకు చైర్మన్ పదవి ప్రకటించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇప్పుడు మాట మార్చారని ఆమె మండిపడుతున్నారు.

 చైర్మన్ పదవి అమ్ముకున్నారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు ..

చైర్మన్ పదవి అమ్ముకున్నారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు ..


తనకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో ఎమ్మెల్యే వల్ల జరిగిన అన్యాయానికి తీవ్ర మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అమ్ముడుపోయారు అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. పదవిని అమ్ముకున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. జమ్మలమడుగు నాలుగో వార్డ్ లో ప్రజాభిమానంతో తాను విజయం సాధించానని, అందరి కంటే అత్యధిక మెజారిటీతో ప్రజలు తనను గెలిపించారని పేర్కొన్న జ్ఞానప్రసూన తమకు ఉన్నంతలో డబ్బులు ఇచ్చామన్నారు .

తనకే చైర్మన్ పదవి ఇస్తానని మాటిచ్చి డబ్బు కోసం వేరేవారికి ఇస్తున్నారని ఆరోపణ

తనకే చైర్మన్ పదవి ఇస్తానని మాటిచ్చి డబ్బు కోసం వేరేవారికి ఇస్తున్నారని ఆరోపణ


ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారికి చైర్మన్ పదవి కట్టబెట్టడానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. జ్ఞాన ప్రసూనకు మద్దతుగా మరికొందరు కూడా రాజీనామాలకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

చైర్మన్ పదవిని అమ్ముకుంటున్నారు అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మొదటి తనకే ఇస్తానని ప్రకటించి ఇప్పుడు ఉన్నపళంగా మాట మార్చి వేరే వారికి పదవిని కట్టబెడుతున్నారని ఆమె ఆరోపించారు.

 ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎలా స్పందిస్తారో : అధినాయకత్వం ఈ పంచాయతీని ఏం చేస్తుందో ?

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎలా స్పందిస్తారో : అధినాయకత్వం ఈ పంచాయతీని ఏం చేస్తుందో ?

ఇక ఎమ్మెల్యేపై రాజీనామా చేసిన వైసీపీ మహిళా కౌన్సిలర్ జ్ఞాన ప్రసూన చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పందించాల్సి ఉంది. జగన్ సొంత జిల్లా కడప జిల్లాలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒక మహిళా నాయకురాలు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి. మరి ఈ జమ్మలమడుగు పంచాయితీ పై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఏమంటారో .. అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

English summary
The election of Kadapa district Jammalamadugu municipality chairperson has fueled dissent in the YSR Congress party. Gnana Prasuna, who won in the fourth ward of Jammalamadugu, resigned from her councilor post this morning. MLA Sudheer Reddy was severely criticized. She is angry that MLA Sudheer Reddy is obstructing her from getting the post and that MLA Sudheer Reddy, who had earlier announced her chairmanship, has now changed his mindfor money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X