కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒకేరోజు వైఎస్ జగన్ సొంత జిల్లాకు రెండు స్వీట్ న్యూస్: వేలమందికి ఉద్యోగాలు

|
Google Oneindia TeluguNews

కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపకు ఒకే రెండు శుభవార్తలు వెలువడ్డాయి. ఈ రెండూ.. ఆ జిల్లాను పారిశ్రామికంగా పురోగమింపజేసేవే. వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన రాయలసీమలోని కడప జిల్లాను అభివృద్ధి పథంలో నడిపింపజేయడానికి ఉద్దేశించిన ఈ రెండు వేర్వేరు ప్రాజెక్టుల వల్ల ప్రత్యక్షంగా.. పరోక్షంగా వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడానికి అవకాశం లభించినట్టయింది.

 స్టీల్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులు..

స్టీల్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులు..

కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నిర్మించ తలపెట్టిన ఏపీ హైగ్రేడ్ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతులు లభించాయి. కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ దీన్ని మంజూరు చేసింది. ఈ మేరకు ఆదేశాలు వెలువడ్డాయి. ఈ స్టీల్ ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మించనున్న విషయం తెలిసిందే. సున్నపురాళ్ల పల్లి, పెద్దండ్లూరు మధ్య రెండేళ్ల కిందట వైఎస్ జగన్.. ఈ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

కొత్త సవరణలతో..

కొత్త సవరణలతో..

పర్యావరణ అనుమతుల కోసం గత ఏడాది డిసెంబరు 20వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించారు. దీనిపై కొన్ని సందేహాలను సంబంధిత మంత్రిత్వ శాఖ వ్యక్తం చేసింది. వాటిని సవరించి పంపించాల్సిందిగా సూచించింది. దీనికి అనుగుణంగా ఈ ఏడాది జనవరిలో పర్యావరణ ప్రభావ అంచనా నివేదికను రూపొందించి.. మళ్లీ కేంద్రానికి పంపిచింది రాష్ట్ర ప్రభుత్వం. కొన్ని సవరణలను కొత్తగా ప్రతిపాదించింది. తాజాగా అవన్నీ పర్యావరణ మంత్రిత్వ శాఖ క్లియరెన్స్ కమిటీ పరిశీలనకు వెళ్లాయి.

గ్రీన్‌బెల్ట్ జోన్‌గా..

గ్రీన్‌బెల్ట్ జోన్‌గా..

వాటిని పరిశీలించిన అనంతరం పర్యావరణ అనుమతులను మంజూరు చేశారు ఆ శాఖ అధికారులు. 2006 నాటి నోటిఫికేషన్‌ ప్రకారం కడప స్టీల్‌ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కొత్తగా ప్రతిపాదించిన సవరణల ప్రకారం.. దీన్ని స్టీల్‌ప్లాంట్‌ ప్రభావం పర్యావరణంపై పడకుండా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గ్రీన్‌ బెల్ట్‌ జోన్‌‌లో భాగంగా ప్లాంట్ పరిధిలో 484.4 హెక్టార్లలో 12.10 లక్షల మొక్కలను నాటాల్సి ఉంటుంది. అయిదేళ్ల కాలంలో దీన్ని పూర్తి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం.

 కొప్పర్తి ఎలక్ట్రానిక్ సిటీలో..

కొప్పర్తి ఎలక్ట్రానిక్ సిటీలో..


అదే సమయంలో- కడప సమీపంలోని కొప్పర్తి ఎలక్ట్రానిక్ సిటీలో కొత్తగా డిక్సన్ టెక్నాలజీస్ ఓ భారీ పరిశ్రమను నెలకొల్పబోతోంది. ఈ పరిశ్రమ వల్ల కనీసం అయిదు వేల మంది వరకు ఉపాధి లభించే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. పరోక్షంగా మరి కొన్ని వేలమందికి ఉపాధి లభిస్తుంది. ముఖ్యమంత్రి వైెఎస్ జగన్‌తో డిక్సన్ కంపెనీ చైర్మన్‌ సునీల్ వాచాని, సీఈవో పంకజ్ శర్మ భేటీ అయ్యారు. ఇప్పటికే ఆ సంస్థకు తిరుపతిలో ఓ యూనిట్‌ ఉంది. దాన్ని మరింత విస్తరిస్తామని ఛైర్మన్ తెలిపారు.

English summary
In a major step towards setting up of Kadapa Steel plant in Andhra Pradesh, the Central Government has approved environmental clearance. Proposed AP High grade steels limited in Kadapa district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X