వైసిపిలోకి ప‌వ‌న్ మాజీ స్నేహితుడు: లోట‌స్‌పాండ్ కు టిడిపి కీల‌క నేత‌లు:75 మంది తో తొలి జాబితా

ఎన్నిక‌ల కోసం వైసిపి క‌ద‌న రంగంలోకి దిగుతోంది. ఇందు కోసం తొలి జాబితాను సిద్దం చేసింది. బుధ‌వారం 75 మంది తో తొలి జాబితాను ప్ర‌క‌టించ‌నున్నారు. అదే స‌మ‌యంలో టిడిపి కీల‌క నేత‌లు లోట‌స్ పాండ్ కు రానున్నారు. వారు వైసిపి లో చేరనున్నారు. ఇక‌, ప‌వన్ క‌ళ్యాన్ మాజీ స్నేహితుడు వైసిపి లో చేరుతున్నారు.

75 మంది తో తొలి జాబితా సిద్దం..

75 మంది తో తొలి జాబితా సిద్దం..

ఎన్నిక‌ల్లో పోటీ చేసే మొత్తం 175 స్థానాల‌కు వైసిపి అభ్య‌ర్ధులు దాదాపు ఖ‌రార‌య్యారు. అందులో భాగంగా తొలి జాబితా 75 మందితో విడుద‌ల చేయాల‌ని వైసిపి డిసైడ్ అయింది. బుధ‌వారం ఈ జాబితా ను విడుద‌ల చేయ‌నున్నారు. మిగిలిన వారి వివ‌రాల‌ను మూడు విడ‌త‌లుగా విడుద‌ల చేస్తామ‌ని పార్టీ నేత‌లు ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే దాదాపు అన్ని సీట్లకు అభ్య‌ర్ధులు ఖ‌రార‌య్యార‌ని చెబుతున్నా..టిడిపి..జ‌న‌సేన లిస్టుల ఆధారంగా అభ్య‌ర్ధుల జాబితాల‌ను వ్యూహాత్మ‌కంగా విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇక‌, లోక్‌స‌భ సీట్ల అభ్య‌ర్ధుల పైనా క‌స‌ర‌త్తు తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ నెల 16 నుండి జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారంలోకి దిగ‌నున్నారు.

వైసిపి లో ప‌వ‌న్ స్నేహితుడు

వైసిపి లో ప‌వ‌న్ స్నేహితుడు

2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో చివ‌రి వ‌ర‌కు టిక్కెట్ ఆశించి..ప‌వ‌న్ ద్వారా ప్ర‌య‌త్నించి విఫ‌లమైన ఆయ‌న స‌న్నిహితుడు పొట్లూరి వ‌ర ప్ర‌సాద్ (పివిపి) వైసిపి లో చేరుతున్నారు. బుధ‌వారం ఆయ‌న త‌న అనుచ‌రుల‌తో క‌లిసి జ‌గ‌న్ స‌మక్షం లో వైసిపి లో చేర‌నున్నారు. అదే విధంగా వైసిపి నుండి విజ‌య‌వాడ ఎంపీగా పోటీ చేయ‌టం దాదాపు ఖాయ‌మైంది. అయితే కొద్ది రోజుల క్రితం టిడిపి వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు దాస‌రి జై ర‌మేష్ వైసిపి లో చేరారు. ఆయ‌న సోద‌రుడు బాల‌వ‌ర్ధ‌న రావు సైతం వైసిపి లో చేరారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జై ర‌మేష్ విజ‌య‌వాడ ఎంపీగా వైసిపి నుండి పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జరిగింది. ఇప్పుడు పివిపి వైసిపి లోకి ఎంట్రీతో ఆయ‌న‌కు ఎటువంటి అవ‌కాశం క‌ల్పిస్తార‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది. అయితే పివిపి పార్టీలో చేరిక కార్య‌క్ర‌మానికి జై రమేష్ కు ఆహ్వానం పంపారు.

టిడిపి నుండి కీల‌క నేత‌లు

టిడిపి నుండి కీల‌క నేత‌లు

కొంత కాలంగా స‌స్పెన్స్ గా సాగిన టిడిపి ముఖ్య నేత‌ల చేరిక ఖ‌రారైంది. టిడిపి ప్ర‌స్తుత ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసు ల రెడ్డి బుధ‌వారం వైసిపి లో చేర‌నున్నారు. ఆయ‌న ఈ ఎన్నిక‌ల్లో వైసిపి నుండి నెల్లూరు లోక్‌స‌భ కు పోటీ చేస్తార‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. నెల్లూరు ఎంపీగా ఉన్న మేక‌పాటి రాజ‌మోహ‌న‌రెడ్డి ఒంగోలు ఎంపీగా బ‌రిలోకి దిగుతారు. ఇక‌, తూర్పు గోదావ‌రి నుండి లోక్‌స‌భ లో టిడిపి ఫ్లోర్ లీడ‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన తోట న‌ర్సింహం టిడిపికి రాజీనామా చేసారు. ఆయ‌న త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వైసిపి లో చేరుతున్నారు. బుధ‌వార‌మే ఈ మేర‌కు ముహూర్తం ఫిక్స్ అయింది. త‌న‌కు ఆరోగ్యం స‌హ‌క‌రించ‌ని కార‌ణంగా త‌న భార్య వాణికి పెద్దాపురం సీటు ఇవ్వాల‌ని వారు కోరుతున్నారు. దీంతో..దొర‌బాబును కాకినాడ నుండి ఎంపీ అభ్య‌ర్దిగా బ‌రిలోకి దించి..వాణికి పెద్దాపురం సీటు ఇవ్వాల‌ని వైసిపి అధినే త నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+