జగన్ కోటలో మీసం మెలేసిన నారా లోకేష్- ఉద్రిక్తత..!!

కడప: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవ్వాళ్టికి 114వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ పాదయాత్ర కడప జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలోని ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం మీదుగా సాగుతున్నారాయన. జమ్మలమడుగు నియోజకవర్గంలో పాదయాత్రను పూర్తి చేసుకున్న ఆయన ప్రొద్దుటూరులో అడుగు పెట్టారు.

113వ రోజున ప్రొద్దుటూరు శివారులోని చౌటపల్లి పాదయాత్రను ప్రారంభవించారు. నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి, సీఎం రమేష్ సోదరుడు సీఎం సురేష్ సహా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బుడగ జంగాలు, స్వర్ణకారులు, ముస్లింలతో సమావేశమయ్యారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Tension prevails in Proddatur during Nara Lokeshs Yuva Galam Padayatra

ప్రొద్దుటూరు శివాలయం సర్కిల్‌లో బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రధానంగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతాన్ని నారా లోకేష్ ప్రస్తావించారు. వివేకాను అత్యంత దారుణంగా చంపించింది అబ్బాయిలేన‌ంటూ మరోసారి ఆరోపించారు. ఈ హత్యకేసు నుంచి తప్పించుకోవడానికి ఎన్నో మార్గాలను వెదుక్కుంటున్నారంటూ ధ్వజమెత్తారు. సీబీఐ సైతం ఇదే విషయం చెబుతోందని పేర్కొన్నారు.

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపులు తీవ్రం అయ్యాయ‌ని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, వారి ఇళ్లపై దాడులు సాగిస్తోన్నా పోలీసులు మౌనంగా ఉంటోన్నారని మండిపడ్డారు. హు కిల్డ్ బాబాయ్ అనే ప్లకార్డ్‌ను ప్రదర్శించారాయన. ఈ హత్యకేసు నుంచి వారిద్దరూ తప్పించుకోలేరని, 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేనని, ఎవ్వర్నీ వదిలిపెట్టబోమనీహెచ్చరించారు.

శివాలయం సర్కిల్‌లో బహిరంగ సభ ముగించుకుని మైదుకూరు రోడ్డులో వెళ్తున్నప్పుడు ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లను విసిరారు. ఆర్టీసి బ‌స్టాండ్ దాటిన త‌రువాత స్థానికులతో మాట్లాడే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అవి ఆయన సెక్యూరిటీ సిబ్బందికి తగిలాయి. కోడిగుడ్లను విసిరిన వారిని గుర్తించిన తెలుగుదేశం కార్యకర్తలు నారా లోకేష్ ఎదురుగా దేహశుద్ధి చేశారు.

Tension prevails in Proddatur during Nara Lokeshs Yuva Galam Padayatra

వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై నారా లోకేష్ వాగ్వివాదానికి దిగారు. రాష్ట్రంలోనే కాదు.. సొంత జిల్లాలో కూడా వైఎస్ జ‌గ‌న్ జంగిల్ రాజ్ న‌డుస్తోందంటూ ధ్వజమెత్తారు. ప్ర‌శాంతంగా సాగుతున్న‌ పాదయాత్రలో అల‌జ‌డి సృష్టించాల‌ని వైసీపీ కార్య‌క‌ర్త‌లు దాడుల‌కి బరితెగించారంటూ ఆరోపించారు. పోలీసుల వైఫ‌ల్యం వ‌ల్లే భ‌ద్ర‌తా సిబ్బందిపై దాడి చేశారని విమర్శించారు.

తమ కుటుంబం 24 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిందని నారా లోకేష్ అన్నారు. తన తండ్రి 14 సంవత్సరాలు, తాత ఎన్టీ రామారావు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారని, వైఎస్ కుటుంబం ముఖ్యమంత్రిగా పని చేసింది 10 సంవత్సరాలేనని గుర్తు చేశారు. పోలీసులతో వాగ్వివాదానికి దిగిన సమయంలో నారా లోకేష్ మీసం మెలేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+