రాజధాని మారిస్తే గ్రేటర్ రాయలసీమ ఇవ్వాలని డిమాండ్ చేసిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి
ఏపీ సీఎం జగన్ రాజధాని విషయంలో పెట్టిన చిచ్చు ఇంకా ఏపీలో రగులుతూనే ఉంది. మూడు రాజధానుల ప్రతిపాదన సరైనది కాదనే ఆభిప్రాయం వ్యక్తం అవుతుంది. వైజాగ్ లో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేస్తే రాయలసీమ వాసులకు చాలా దూరమా అవుతుందని రాయలసీమ వాసులు వైజాగ్ పరిపాలనా రాజధాని చెయ్యటాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే రాజధాని మారిస్తే గ్రేటర్ రాయలసీమ ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది.
రాజధాని రాయలసీమలోనే ఏర్పాటు చెయ్యాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు రాయలసీమ వాసులు. ఒకపక్క అమరావతిలో రైతులు రాజధాని తరలించవద్దు అని ఉద్యమం చేస్తుంటే ఇక రాయలసీమ వాసులు రాజధాని తమ ప్రాంతంలోనే ఏర్పాటు చెయ్యాలని, లేదా ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

నెల్లూరు, ప్రకాశం జిల్లాలను రాయలసీమలో కలిపి గ్రేటర్ రాయలసీమ ఇవ్వాలని లేకపోతే గ్రేటర్ రాయలసీమ ఉద్యమం ప్రారంభిస్తామని కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి స్పష్టం చేశారు. రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తర్వాత ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. ఇక రాజధానిపై ప్రజలను జగన్ తప్పుదోవ పట్టిస్తున్నారని కేఈ ప్రభాకర్ విమర్శించారు.గ్రేటర్ రాయలసీమ కోసం పార్టీలకతీతంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని తెలిపారు. మొత్తానికి రాయలసీమ వాసులు మాత్రం జగన్ మూడు రాజధానుల ప్రకటనను, ముఖ్యంగా వైజాగ్ పరిపాలనా రాజధాని చేస్తామన్న ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.












Click it and Unblock the Notifications