కరీంనగర్‌లో కరోనా కలకలం: మెడికల్ కాలేజీలో 46 మందికి కోవిడ్ పాజిటివ్, ఆ కార్యక్రమంతోనే
కరీంనగర్: నిన్నమొన్నటి వరకు రాష్ట్రంలో నియంత్రణలోనే ఉన్న కరోనావైరస్ కేసులు.. ఒమిక్రాన్ అలజడి నేపథ్యంలో మళ్లీ పెరుగుతున్నాయి. విదేశాల నుంచి వచ్చినవారు ఎక్కువగా కరోనా బారినపడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి, జనం గుమిూడే కార్యక్రమాల ద్వారా కరోనా వ్యాప్తి జరుగుతోంది. కేంద్ర, ప్రభుత్వాలు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ మార్పు రాకపోవడంతో కేసులు పెరుగుతున్నాయి.

కరీంనగర్ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం
తాజాగా, కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్‌లోని చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీలో కరోనా కలకలం రేపింది. ఇప్పటి వరకు ఈ కాలేజీలో 46 మంది విద్యార్థులకు కోవిడ్ నిర్ధారణ అయ్యింది. కాలేజీలోని అందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో యాజమాన్యం కాలేజీకి సెలవు ప్రకటించింది.

46 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్
కాగా, కాలేజీలో వారం రోజుల క్రితం స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కరోనా లక్షణాలున్న ఒకరిద్దరు విద్యార్థుల నుంచి మిగిలినవారికి వ్యాపించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, శనివారం నిర్వహించిన పరీక్షల్లో 18 మందికి కరోనా నిర్ధారణ కాగా, ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో మరో 28 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. కొందరు విద్యార్థులకు ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ కరోనా ఉన్నట్లు తేలిందని అధికారులు తెలిపారు. దీంతో కరోనా లక్షణాలు లేని విద్యార్థులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి: వైద్యారోగ్య శాఖ
కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డా.శ్రీనివాసరావు సూచించారు. కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దాస్తున్నామన్న వార్తలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. తప్పుడు వార్తలతో వైద్యారోగ్యశాఖ మనోస్థైర్యం తగ్గుతుందన్నారు. కరోనా కంటే తప్పుడు వార్తలు ప్రమాదకరమన్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జనవరి 15 తర్వాత రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని.. ఫిబ్రవరిలో భారీగా కేసులు నమోదు కావొచ్చని డీహెచ్ అభిప్రాయపడ్డారు. ప్రజలంతా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని.. లేదంటే కావాలనే ప్రమాదాన్ని ఆహ్వానించినట్లు అవుతుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. కరోనా మూడో దశను ఎదుర్కోడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్న ఆయన.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
Recommended Video

తెలంగాణలో కరోనా నియంత్రణ చర్యలపై లోకాయుక్త సీరియస్
ఇది ఇలావుండగా, తెలంగాణలో కరోనా నియంత్రణకు ఎలాంటి పటిష్ట చర్యలు చేపట్టడం లేదంటూ లోకాయుక్త సీరియస్ అయ్యారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ పెట్టకకపోవడం, స్మోకింగ్ పై సుమోటోగా కేసు స్వీకరించారు. నిబంధనలు కఠినంగా అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు లోకాయుక్తా. గుంపులుగా తిరగడం, మాస్క్ లేకపోవడం వల్ల కరోనా వ్యాప్తి చెందుతోందని ఆందోళన వ్యక్తం అవుతోంది. పోలీసులు, హెల్త్, మునిసిపల్ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని లోకాయుక్త మండిపడ్డారు. యువకులు టీ స్టాళ్లు, బేకరీలు, ఫుడ్ స్టాల్ దగ్గర బాగా గుమిగూడుతున్నారు. కరోనా నియమనిబంధనలు కఠినంగా అమలు చేసి నివేదిక ఇవ్వాలని, కేసు విచారణ డిసెంబర్ 17 తేదీకి వాయిదా వేశారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం మాస్కు తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, మాస్క్ ధరించకపోతే రూ. 1000 జరిమానా అని పేర్కొంది. అయినప్పటికీ చాలా మంది బహిరంగ ప్రదేశాల్లోనూ మాస్కులు ధరించడం లేదు. ఈ క్రమంలోనే లోకాయుక్త ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications