నిజాలు మాట్లాడితే అంతే, మౌనంగా ఉంటే పదవీలో ఉండేవాడిని, గంగులపై ఈటల విమర్శలు
నిజాలు చెప్పినందుకే తన పదవి పోయిందనీ మాజీమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నోరు విప్పకుండా మిగతావారిలా మౌనంగా ఉండి ఉంటే మంత్రి పదవిలో కొనసాగేవాడినని అన్నారు. గతంలో తనకు టికెట్ ఇచ్చినవాళ్లే తనను ఓడించాలని చూశారని.. గతంలో జరిగిన కొన్ని ఘటనలను గుర్తుచేసుకున్నారు. మంత్రి గంగుల కమలాకర్ లక్ష్యంగా విమర్శలు చేశారు.
ఉద్యమ సమయంలో తన మీద ఎన్నో కేసులు పెట్టారని, జైలుకు కూడా వెళ్లి వచ్చానని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నకొందరు నాయకులకు ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేదన్నారు. వారికి ఉద్యమం అంటే ఏంటో తెలియదని.. కానీ వారికి మాత్రం పదవులు లభించాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్లి వచ్చానని.. కానీ కరీంనగర్ మంత్రి ఏనాడైనా జైలుకు వెళ్లి వచ్చాడా? ఏనాడైనా ఉద్యమంలో పాల్గొన్నారా అంటూ మంత్రి గంగుల కమలాకర్‌ను ఉద్ధేశించి ఈటల విమర్శలు చేశారు.

హుజారాబాద్ నియోజక వర్గం నుంచి గెలుపొంది.. తన నియోజక వర్గానికి ఎంతో అభివృద్ధి చేశాననీ వివరించారు. హుజూరా బాద్ ప్రజలకు తనంటే ఎంతో అభిమానమని.. నాకు మద్ధతుగా ఉంటారని తెలిపారు. తన మద్ధతుదారులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఈటల రాజేందర్ తెలిపారు. హుజారాబాద్ ప్రజలను మభ్యపెట్టేందుకు ఇప్పుడు వారి కోసం అవి చేస్తాం ఇవి చేస్తామని నమ్మిస్తున్నారని.. ఇందులో భాగంగానే కులసంఘాల భవనాలు, పెన్షన్లు ఇచ్చి ఆకట్టుకుంటున్నారని విమర్శించారు.
Recommended Video
ఇప్పటివరకు లేనివి ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు? ఓటు బ్యాంకు కోసమేనని విమర్శించా రు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుంటే హుజూరాబాద్‌లో అస్సలు ఏ మంత్రి అయినా అడుగుపెట్టేవారా? కానీ ఇప్పుడు మాత్రం ప్రజలను మభ్య పెట్టటానికి మంత్రులు హుజూరాబాద్‌లో పర్యటనలు చేస్తున్నారని గుర్తుచేశారు. వీటన్నింటినీ జనం గమనిస్తున్నారని వివరించారు.












Click it and Unblock the Notifications