జూటేబాజ్, బట్టేబాజ్.. బీజేపీపై హరీశ్ రావు ఫైర్
హుజురాబాద్ పోరులో మాటల తూటాలు పేలుతున్నాయి. మెయిన్‌గా ఈటల రాజేందర్- హరీశ్ రావు మధ్య కౌంటర్ అటాక్ జరుగుతుంది. ఈటల రాజేందర్ కు ఓటమి భయం పట్టుకుందని హరీశ్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ఓడిపోతాననే ఫస్ట్రేషన్ లో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నడాని ఆరోపించారు. అరేయ్.. ఓరేయ్ అంటూ.. కూలగొడత, కాలబెడతా అంటున్నాడని హరీశ్ రావు అన్నారు. వావిలాలలో ఎన్నికల ప్రచారంలో ఈ కామెంట్స్ చేశారు. ఓటమి భయంతో ఈటల విపరీత వాఖ్యలు చేస్తున్నారని, ఫస్ట్రేషన్ లో నోరు జారి మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు.

ఏం చేసింది..
ఎన్నికలు వచ్చినప్పుడు ఏడేండ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏం పని చేసిందని అడిగారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఏం పని చేసింది అన్నది చర్చ జరగాలి , ఇకముందు ఏం చేస్తామో చెప్పి ఓట్లు అడగాలి కానీ సానుబూతి మాటలు, రెచ్చగొట్టే మాటలు, పరుషపదజాలంతో మాట్లాడుతున్నారని అన్నారు. ఈటలకు బీజేపీ వాసన బాగా పట్టింది. బీజేపీ అంటే జూటేబాజ్, బట్టేబాజ్ పార్టీ అని హరీశ్‌రావు గాటుగా వివర్శించారు. వావిలాల మండలం కావాలని ఇక్కడి వారు 36 రోజులు నిరహార దీక్ష చేశారు. అయినా రాజేందర్ మనసు కరగలేదు.

ఇవ్వలే..
అరెస్టులు చేశాడు.. తప్ప మండలం ఇవ్వలేదు. మండలం కన్నా ఎక్కువ పని చేస్తా అన్నడు. కానీ ఒక్క ఇళ్లు వచ్చిందా, పశువుల దవాఖానా వచ్చిందా ? మాటలు తప్ప చేతల్లో జరిగిందేమి లేదని ఎద్దెవా చేశారు. గెల్లును అఖండమైన మెజా ర్టీతో గెలిపించాలని కోరారు. కేసీఆర్ కాళ్లు మొక్కయినా వావిలాల మండలం చేయిస్తా. ఇది ఉద్యమం జరిగిన గడ్డ. మండలం కోసం పోరాటం జరిగింది. ఎన్నికల కోడ్ అయ్యాక మండలాన్ని చేసుకుందాం. ఇది మీ చేతుల్లో ఉంది. గెల్లుపై సీఎం కు ప్రేమ ఉంది. గెల్లు, నేను కేసీఆర్ దగ్గరకు వెళ్లి మీ పోరాటం నిజం చేసే బాధ్యత తీసుకుంటాం అని హామీ ఇచ్చారు.

ఎవరికీ లాభం
రాజేందర్ గెలిస్తే వ్యక్తిగా ఆయనకు లాభం- బీజేపికి లాభం. గెల్లు గెలిస్తే వావిలాల ప్రజలకు- హుజూరాబాద్ నియోజక వర్గానికి లాభం అవుతుందని, బీజేపీ గెలవడం వల్ల ఒరిగేదేం లేదన్నారు. బండి సంజయ్, అరవింద్ ఇక్కడ బాగానే మాట్లాడుతున్నారు. కానీ సిలండర్ ధరను తగ్గిస్తరా...తగ్గించరా.. పెట్రోల్...డిజిల్ తగ్గిస్తరా...తగ్గించరా...చెప్పండి ముందు అని నిలదీశారు. అభివృద్ధి ఏదైనా టీఆర్ఎస్ వల్లే సాధ్యమవుతుందని రాజేందర్‌తో సాధ్యం కాదని హరీశ్ స్పష్టం చేశారు.

ఏదీ బోర్డు
అర్వింద్ అనే నిజామాబాద్ బీజేపీ ఎంపీ. రైతుల కు బాండ్ పేపర్ మీద మూడు నెలల్లో పసుపు బోర్డు తెస్తా అని రాసిచ్చిండు. అది అటే పోయింది. ఆయన వచ్చి హుజూరాబాద్ లోఏదో చేస్తా అంటున్నడు. బాండ్‌పేపర్ రాసి మోసం చేసిన వ్యక్తి ఇక్కడ చెబితే ఎవరైనా వింటరా. ఈటల రాజేందర్ కూడా ఇలాగే చేస్తారని అర్థమవుతుందని హరీశ్ అన్నారు

ధరల వాత
గ్యాస్, డిజీల్, పెట్రోల్ ధరలు పెంచడంతో పాటు కరెంట్ మీటర్లు పెట్టి పన్నులు పెంచిన బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలి.పేదల మీద పన్నులు వేసి, బడా బడా కార్పొరేట్ పెద్దలకు పది లక్షల కోట్ల రుణం మాఫీ చేసింది. రైతులకు, చేనేత కార్మికులకు, పేదల రుణాల మాత్రం మాఫీ చేయని బిజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. గెల్లును గెలిపించండి- వావిలాలను మండలం చేసుకుందామని తేల్చి చెప్పారు.