నాది కారు గుర్తు అని ప్రచారం, బెదిరింపులు: హరీశ్ రావును కేసీఆర్ ఏనాటికీ నమ్మరంటూ ఈటల

కరీంనగర్: హుజూరాబాద్‌ ఉపఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి హరీశ్ రావు, మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పరస్పర విమర్శల దాడి చేసుకుంటున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో తనపై పోటీ చేయాలంటూ సీఎం కేసీఆర్, హరీశ్ రావులకు ఈటల రాజేందర్ సవాల్ విసిరిన విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

నాది కారు గుర్తు అని ప్రచారం, బెదిరింపులు: ఈటల రాజేందర్

నాది కారు గుర్తు అని ప్రచారం, బెదిరింపులు: ఈటల రాజేందర్

గురువారం జమ్మికుంటలో పర్యటించిన సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ తన విమర్శల దాడిని కొనసాగించారు. హుజూరాబాద్‌ను తన శాయశక్తులా అభివృద్ధి చేశానని అన్నారు. హుజూరాబాద్‌లో పెద్దగా పెండింగ్ పనులే లేవన్నారు. చేసిన పనులకు చాలా మందికి బిల్లులు రావడం లేదన్నారు. తనకు బీజేపీ నేతల నుంచి పూర్తి సహకారం ఉందన్నారు. తనది కారు గుర్తు అని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నిండుగా ఉంటే.. మధ్యాహ్న భోజన నిర్వాహకులకు డబ్బులు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. రైతు బంధు తెలంగాణ మొత్తం అమలు చేసి.. దళిత బంధును హుజూరాబాద్‌లోనే ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. తనకు ఓటేస్తే పథకాల నుంచి పేర్లను తొలగిస్తామని టీఆర్ఎస్ నేతలు ప్రజలను బెదిరిస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. అది అవాస్తవమని.. దుబ్బాకలో అలాగే చేశారా? అని ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో డబ్బులు పంచడానికి హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములు అమ్మేశారని అన్నారు. మూడు నెలల నుంచి ప్రచారం చేస్తున్నాను, ఎన్నికల్లో గెలిచేది తానేనంటూ ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.

హరీశ్ రావును కేసీఆర్ ఏనాటికీ నమ్మరు..

హరీశ్ రావును కేసీఆర్ ఏనాటికీ నమ్మరు..

హరీశ్ రావు ఎంత పనిచేసినా.. సీఎం కేసీఆర్ అతడ్ని నమ్మరని ఈటల వ్యాఖ్యానించారు. ఏనాటికైనా టీఆర్ఎస్‌ను కైవసం చేసుకోవాలని హరీశ్ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ.. అది సాధ్యం కాదన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే హరీశ్ రావును చరిత్ర క్షమించదని అన్నారు. చిల్లర ఆరోపణలు, చౌకబారు ప్రచారాలు చేయొద్దన్నారు. ధర్మం, న్యాయానికి విరుద్ధంగా పనిచేస్తే ప్రజల్లో చులకన అవుతామన్నారు. హరీవ్ రావుతో తనది 18 ఏళ్ల అనుబంధమని, అవన్నీ మర్చిపోయి సీఎం దగ్గర మార్కుల కొట్టేసేందుకు ఇవన్నీ చేయొద్దని ఈటల హితవు పలికారు. హరీశ్ రావు మోసపూరిత మాటలు హుజూరాబాద్ ప్రజలు నమ్మరని అన్నారు. దుబ్బాకలో ఎంత ప్రచారం చేసినా ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినట్లు బుద్ది చెప్పారన్నారు. హుజూరాబాద్‌లోనూ అదే జరుగుతుందన్నారు.

హరీశ్ రావు నీలా కాదు నేను: ఈటల రాజేందర్

హరీశ్ రావు నీలా కాదు నేను: ఈటల రాజేందర్

'ఎమ్మెల్యేగా గెలవకుండానే మంత్రి అయిన వాడివి నువ్వు. మీ మామ నియోజకవర్గంలో నువ్వు వరుసగా గెలుస్తున్నావు. కానీ, నేను అలాకాదు. ఒక్క అవకాశం ఇస్తే.. ఓటమి లేకుండా ప్రజల ప్రేమను పొందిన వాడిని. హుజూరాబాద్ లో అభివృద్ది జరగలేదు అంటున్నారు. నువ్వు నిన్న తిరిగిన 4 లైన్ రోడ్లన్నీ నేను వేయించినవే.
అభివృద్ది విషయంలో మీకు ఎంత సోయి ఉందో.. నాకూ అంతే సోయి ఉంది. ఆగష్టు 3, 2018న 50 మహిళా సంఘాలకు 10 లక్షల రూపాయలు నేను ఇచ్చిన. ఈ రోజు మీరు ఓట్ల కోసం ఇస్తున్నారు. హుజూరాబాద్ లో 3900 ఇండ్లు మంజూరు అయ్యాయి. జమ్మికుంటలో, హుజూరాబాద్లో, కమలాపూర్ లో 500 ఇండ్లు కట్టించాను. ఇంకో 500 ఇండ్లు ధర్మారం, కోరుకల్, చిన్న ముల్కనూర్‌లో కట్టించాను. సిద్దిపేటలో, గజ్వేల్లో, సిరిసిళ్ళలో డబుల్ బెడ్ రూమ్ లు కడుతుంది కాళేశ్వరం కట్టిన కాంట్రాక్టర్స్ కాదా. తెలంగాణ ఏర్పడిన తరువాత హుజూరాబాద్ నియోజకవర్గ రూపురేఖలు మార్చిన. 18 చెక్ డ్యామ్ లు కట్టినం. రూ. 1050 కోట్లతో ఎస్ఆర్ఎస్పీ కాలువలు బాగుచేయించిన. హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాలకు చేరో రూ. 40 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే.. వాటిని మంజూరు కాకుండా కేటీఆర్ ఆపారు. ఆ డబ్బులను ఇప్పుడు మంజూరు చేసి.. కొత్తగా ఇస్తున్నట్టు జీవో ఇచ్చారు' అని ఈటల రాజేందర్ చెప్పారు.

కోట్లతో ప్రజలను కొనేందుకు పునాది వేసింది కేసీఆరే..

కోట్లతో ప్రజలను కొనేందుకు పునాది వేసింది కేసీఆరే..

'వందల కోట్లతో ఓట్లను కొన్నవాడిగా కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది
ఉప ఎన్నికలో గెలవాలని ఇప్పటికే 192 కోట్ల రూపాయలు హుజూరాబాద్ లో ఖర్చు పెట్టారు. నాతో పాటు 11 మంది సొంత పార్టీ నేతలను ఓడ గొట్టడానికి కేసీఆర్ ప్రతిపక్ష నేతలకు డబ్బులు ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లు అన్నీ ట్యాప్ అవుతున్నాయి. 17 శాతం మంది జనాభా ఉన్న ఎస్సీలకు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారు? వెలమలకు ఎన్ని పదవులు ఇచ్చారు? మూడు సార్లు ప్రగతి భవన్ గేట్ దగ్గర మమ్ముల్ని ఆపారు. టీఆర్ఎస్‌లో 2016 నుంచే బానిస బతుకులు మొదలయ్యాయి. మంత్రులకు కూడా సీఎం దగ్గర అపాయింట్మెంట్ లేదని ఆపితే.. ఇదే కరీంనగర్ మంత్రి గంగుల కమలాకర్.. ఇంత అహంకారమా? ఇంత దొరతనమా? కరీంనగర్ నుంచే మళ్ళీ ఉద్యమం రావాలి అని ఆనాడు అన్నారు. ఈ రోజు ఇక్కడ వచ్చి ఏదో మాట్లాడుతున్నారు. ప్రగతి భవన్ కాదు బానిస భవన్ అని పెట్టుకో అని గోళీలు ఇచ్చే ఎంపీ సంతోష్ కుమార్‌కి ఆనాడే చెప్పిన. దమ్ము ఎవరికి ఉందో తెలుసుకోండి. నా పదవి కంటే నా ఆత్మ గౌరవం గొప్పది. వందల కోట్లతో ప్రజలను కొనడానికి పునాది వేసిన వాడిగా కేసీఆర్ మీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది' అని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+