Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాంగ్రెస్ నుంచి కొండా సురేఖ కన్ఫామ్..? ఆ సామాజిక వర్గాల ఓట్లే లక్ష్యం

హుజూరాబాద్‌ బై పోల్ పోరు రంజుమీదుంది. ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రచారంలో దూసుకెళుతోంది. కాంగ్రెస్ పార్టీ కాస్త ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుంది. గ‌తంలో హస్తం గుర్తుపై పోటీ చేసిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ గూటికి చేరడంతో ఆ పార్టీకి లోక‌ల్‌గా బలమున్న నేత లేకుండాపోయారు. దీంతో ప‌క్క నియోజ‌క వ‌ర్గాల నుంచి నేతల‌ను తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొండా సురేఖ

కొండా సురేఖ

వరంగల్‌ జిల్లాలో పట్టు ఉన్న కొండా సురేఖను హుజురాబాద్‌ నుంచి పోటీ చేయించాలని టీపీసీసీ భావిస్తోంది. వ‌రంగ‌ల్ తూర్పు, ప‌ర‌కాల‌, భూపాల ప‌ల్లి నియోజ‌క వ‌ర్గాల్లో బల‌మైన నేత‌గా ఉన్న కొండా సురేఖ‌ను బరిలోకి దించాలని అనుకుంటుంది. ప‌ద్మశాలి, మున్నూరు కాపు సామాజిక వ‌ర్గాల‌ ఓట్లు హస్తం గుర్తుకు పడతాయని అంచనా వేస్తున్నారు. అటు క‌మ‌లాక‌ర్ రెడ్డి, కృష్ణారెడ్డిల పేర్లను కూడా టీపీసీసీ పరిశీలిస్తోంది. టీఆర్ఎస్‌, బీజేపీ ప్రచారంలో దూసుకుపోతుంటే కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థుల వడపోత దగ్గరే ఆగిపోయింది. ప్రస్తుతానికి హుజురాబాద్‌లో ద్విముఖ పోరు కనిపిస్తున్నప్పటికీ.. తాము ఎంటరయ్యాక యాంగిల్‌ ఫైట్ అవుతుందని కాంగ్రెస్‌ నేతలు చెప్పుకుంటున్నారు.

సంక్షేమ పథకాలు

సంక్షేమ పథకాలు


నియోజకవర్గంలో దళితుల కోసం ప్రభుత్వం దళితబంధు పథకానికి నిధులు విడుదల చేసింది. పెండింగ్ ప‌నుల‌ను పూర్తి చేస్తామంటూ హామీలిస్తున్నారు. గొల్ల,కుర్మలకు గొర్లను కూడా పంపిణీ చేస్తున్నారు. మిగతా బీసీల మద్దతు కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ హుజురాబాద్‌లోనే మకాం వేసి కార్యకర్తల్లో కొత్త జోష్‌ నింపుతున్నారు. అధికారికంగా ప్రక‌టించ‌క పోయినా.. బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ దాదాపు ఖరారయ్యారు. ఈటెల రాజేంద‌ర్ నియోజ‌క వ‌ర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 11 రోజుల పాటు నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేశారు.

జమున కూడా..

జమున కూడా..

ఇదివరకు చేసిన అభివృద్ది పనులను వివరిస్తూ.. టీఆర్ఎస్‌ పార్టీలో తనకు జరిగిన అవమానాన్ని ప్రజలకు చెప్పుకుంటూ వారి మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్‌కు రాజీనామా చేసినప్పటి నుంచి నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. అటు ఈటల భార్య జమున సైతం హుజురాబాద్‌లోని పలుగ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. మరి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో రానున్న రోజుల్లో తేలిపోనుంది. కాంగ్రెస్ కూడా బలమైన అభ్యర్థి కోసం చూస్తోంది. అందులో భాగంగానే కొండా సురేఖ పేరు ఖరారు అయినట్టు తెలుస్తోంది.

మాటలయుద్దం

మాటలయుద్దం

హుజురాబాద్ బై పోల్ వేళ సీరియస్ నెస్ ఎక్కువ అవుతుంది. ప్రధాన పార్టీల మధ్య విమర్శలు మరింత ముదురుతున్నాయి. వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రధాన రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అందుకోసమే ఓటర్లను ఆకట్టుకునేందుకు శతవిధలా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే షెడ్యూల్ రాలేదు.. కానీ నియోజకవర్గంలో డబ్బు, మద్యం ఎరులై పారుతోందని విశ్వసనీయంగా తెలిసింది. ఎన్నికల్లో విజయం ఈటల రాజేందర్‌కు జీవన్మరణ సమస్య కాగా.. టీఆర్ఎస్ కూడా ప్రతిష్టత్మకంగానే తీసుకుంది. కాంగ్రెస్ కూడా అదేవిధంగా పోటీ చేయనుంది. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపనుంది. బై పోల్ ఏమో కానీ.. నియోజకవర్గంలో వందల కోట్లను అభ్యర్థులు గుమ్మరించే ఛాన్స్ ఉంది. మద్యం ఏరులై పారగా.. నగదు కూడా ఎక్కువగానే ఇస్తున్నారు.

ఆకట్టుకునే యత్నం

ఆకట్టుకునే యత్నం

మరోవైపు హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ. బై పోల్ చుట్టూ రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తున్నాయి.

ఆ తర్వాత

ఆ తర్వాత


దళిత బంధు పథకం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హుజురాబాద్ ఎన్నిక తర్వాత కూడా పథకం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో దళితులు ఎక్కువగా ఉన్నందున.. పథకం తెరపైకి తీసుకొచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో నిధులు కూడా రిలీజ్ చేశారు. అయితే మిగతా ప్రాంతాల సంగతి ఏంటీ అనే ప్రశ్న వస్తోంది. బై పోల్ కోసం హుజురాబాద్‌లో కొందరినీ ఎంపిక చేసి.. ఇచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మరీ మిగతా ప్రాంతాల సంగతి ఏంటీ అనేది ఇక్కడ ప్రశ్న.. రాష్ట్రంలో గల నిరుపేద దళితులు.. దళిత బంధు పథకం కోసం ఆప్లై చేసుకోవాలా... నిజంగానే నగదు ఇస్తారా అనే సందేహాం ప్రతీ ఒక్కరిలో మెదలుతుంది. కానీ దీనికి సంబంధించి సమాధానం కావాలంటే కాలామే చెప్పాలి. ఎందుకంటే బై పోల్ జరిగే వరకు ఏ విషయంపై క్లారిటీ ఉండదు. ఎన్నిక, ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు.. ఎందుకంటే పాలకులు బడుగు, బలహీనవర్గాలను పట్టించుకోవడం అరుదుగానే ఉంటుంది. మరీ దళిత బంధు విషయంలో అలా జరుగుతుందా.. లేదో చూడాలీ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+