కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శభాష్ దమ్మాయిపేట.. నో కరోనా కేసు, ఏం చేశారంటే...

|
Google Oneindia TeluguNews

కరోనా విలయతాండవం చేస్తుంది. సెకండ్ వేవ్ ప్రభావంతో భారీగా కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా కేసుల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆ గ్రామంలో కేసులు మాత్రం రావడం లేదు. వివరాలేంటో తెలుసుకుందాం. పదండి.

దమ్మాయిపేట గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలుస్తోంది. ఈ గ్రామం కరీంనగర్ జిల్లాలో ఉంది. ఫస్ట్, సెకండ్ వేవ్‌లలో కరోనా కేసులే రాలేదని తెలుస్తోంది. దీనికి కారణం గ్రామస్తుల ఐక్యమత్యమే అంటున్నారు గ్రామ పెద్దలు. కరోనా ఉదృతి ప్రారంభం అవకముందే ప్రజలందరికి మాస్కులు పంచారు సర్పంచ్.. ఇక పక్క గ్రామాల నుంచి దమ్మాయి పేట వచ్చేవారిని గ్రామ సరిహద్దుల్లోని ఆపేస్తున్నారు.

no corona cases in dammaipet

గ్రామంలో సోడియం హైపో క్లోరైట్ ద్రావణం పిచికారీ చేస్తున్నారు. గ్రామంలోని దుకాణ దారులు సరుకుల కోసం బయటకు వెళ్ళినప్పుడు వారిని తగిన జాగ్రత్తలు పాటించే విధంగా అవగాహన కల్పించారు. అలా ప్రజల సహకారంతో కట్టుదిట్టం చేసి కరోనాను గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు గ్రామస్తులు. వీరు ఇతరులకు చాలా ఆదర్శంగా నిలిచారు. శభాష్ దమ్మాయిపేట అని అందరూ కీర్తిస్తున్నారు.

English summary
no corona case in dammaipet village, located at karimnagar district
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X