ఎర్రబెల్లికి నిరసన సెగ, రుణమాఫీ, డబుల్ బెడ్ రూం ఏదీ అని నిలదీత
అందరీ కన్ను హుజురాబాద్‌పై పడింది. ముఖ్యంగా బీజేపీ/ టీఆర్ఎస్ నేతలు పోటీ పడి మరీ ప్రజలను కలుస్తున్నారు. ఉప ఎన్నిక ఉన్నందున నేతలు రావడం, తాయిలాలు ప్రకటించడం కామనే.. కానీ అధికార పార్టీ నేతలకు నిరసన సెగ తగిలింది. సాక్షాత్ మంత్రిని ఓ గ్రామస్తులు నిలదీశారు. తమకు ఏం చేయలేదని ప్రశ్నించారు. మౌలిక వసతుల కల్పనలో విఫలం అయ్యారని విమర్శించారు.

రుణమాఫీ ఏదీ..?
హుజురాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లిలో పల్లె ప్రగతి కార్యక్రమం జరిగింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంకేముంది గ్రామస్తులు సమస్యలను ప్రస్తావించడం ప్రారంభించారు. వారికి సర్ది చెప్పలేక మంత్రి ఎర్రబెల్లి.. ఇబ్బంది పడ్డారు. రుణమాఫీ చేయడం లేదని ఓ రైతు ప్రశ్నించారు. దీంతో ఎర్రబెల్లి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆయన వినిపించుకోలేదు. ఎందుకు చేయలేదు అని అడిగారు.

డబుల్ బెడ్ రూం..
ఓ మహిళ డబుల్ బెడ్ రూం సంగతేంటి అని అడిగారు. ఎప్పుడు నిర్మిస్తారని అడగగా.. గతంలో ఉన్నవారిని అడగకపోయావా.. అంటే వారేం చేయలే, మీరేం చేయలే అని అనడంతో కాసింత ఇబ్బంది పడాల్సి వచ్చింది. మరొకరు తాగునీరు లేదని.. మంచినీటి సమస్య ఉందని చెప్పారు. గ్రామంలో గల వాటర్ ట్యాంక్ నీరు రావడం లేదని.. మిషన్ భగీరథ నీరు కూడా ఇవ్వడం లేదని తమ సమస్యను ఏకరువు పెట్టారు.

మంచినీరు
ఒక్కొక్కరు సమస్యలను ప్రస్తావించడంతో ఎర్రబెల్లి నీళ్లు నమలాల్సి వచ్చింది. సమస్యకు తాము కారణం కాదని చెప్పారు. గతంలో ఉన్న మంత్రి చేయలేదని.. ఇప్పుడు తమను అనడం సరికాదన్నారు. తనను మాట్లాడనివ్వాలని ఎర్రబెల్లి దయాకర్ కోరారు. ఈటల రాజేందర్ పని చేయలేదని పరోక్షంగా ప్రస్తావించారు. ప్రభుత్వం అందరినీ అన్నివిధాలుగా చూసుకుంటుందని.. పని చేయించాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే చేతిలో ఉంటుందని చెప్పారు. మరీ ఇన్నాళ్లూ సమస్యను గాలికొదిలేసింది ఈటల రాజేందర్ అనేలా కామెంట్ చేశారు.

ప్రసన్నం చేసుకునేందుకు వస్తే..
బై పోల్ నేపథ్యంలో ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు వస్తే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. వారి నుంచి ప్రశ్నల వర్షం వచ్చింది. ఒక్కో ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చింది. చివరకీ ఈటల రాజేందర్‌పై నెపం నెట్టివేసి.. ఆ సమయంలో తప్పించుకున్నారు. కానీ ప్రజలు మాత్రం దానిని అంతా ఈజీగా మరచిపోయే అవకాశం లేదు.












Click it and Unblock the Notifications