హుజురాబాద్ నుంచి బరిలోకి పొన్నం..? బీసీ కార్డు పనిచేస్తోందా..?
హుజురాబాద్ ఉప పోరు రంజుగా మారింది. బై పోల్‌కు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ కాలే.. కానీ అభ్యర్థుల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. బీజేపీ నుంచి ఖాయం కాగా.. టీఆర్ఎస్, కాంగ్రెస్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. టీఆర్ఎస్ నుంచి రమణ బరిలోకి దిగే అవకాశం ఉంది. కానీ తనకే టికెట్ వస్తుందని కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ దుమారమే రేపాయి. కాంగ్రెస్ ఇంచార్జీ అభ్యర్థి పార్టీ వీడాల్సి వచ్చింది. దీంతో కాంగ్రెస్ నుంచి ఎవరూ బరిలోకి దిగతారనే సస్పెన్స్ కొనసాగుతోంది.

బరిలోకి పొన్నం..
హుజురాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పొన్నం ప్రభాకర్ పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన ప్రచారం చేస్తున్నారు. కానీ ఇంతకుముందే కౌశిక్ రెడ్డి వర్గంతో గొడవ జరిగింది. తర్వాత ఆడియో టేపుల కలకలం.. వివరణ కోరడం చకచకా జరిగిపోయాయి. ఇంతలోనే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇది పొన్నం ప్రభాకర్‌కు కలిసి వచ్చింది. ఇంతకుముందే ప్రచారం చేయగా.. ఇప్పుడు కౌశిక్ నుంచి అడ్డు తొలగిపోయింది.

ఓసీ అనీ..
వాస్తవానికి హుజురాబాద్ నుంచి కౌశిక్ రెడ్డిని పోటీ చేయించేందుకు రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. అందుకే కాస్త ఎడ మొహం.. పెడ మొహంగానే ఉన్నారు. పీసీసీ చీఫ్ అయిన వెంటనే కలిసిన... లోన సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్నాయి. ఈ క్రమంలో పొన్నం ప్రభాకర్ దూసుకొచ్చారు. హుజురాబాద్ నుంచి పోటీ చేస్తానని సంకేతాలు ఇచ్చారు. దీంతో రేవంత్ రెడ్డి ఆయన వైపు మొగ్గుచూపారు. కానీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

బీసీ కార్డు
ఒకవేళ కౌశిక్ రెడ్డికి ఇవ్వాల్సి వస్తే.. ఓసీకి టికెట్ ఇవ్వాల్సి వచ్చేది. అదే బీసీ కార్డు ఉన్న పొన్నంకు ఇస్తే ఈక్వేషన్స్ కలిసి వస్తాయి. అందుకోసమే రేవంత్ రెడ్డి ఇటు వైపు మొగ్గుచూపారు. హుజురాబాద్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది. వారిని ప్రసన్నం చేసుకోవడం అంటే.. పొన్నం ప్రభాకర్‌కు టికెట్ ఇవ్వడమే మేలు అని భావించారు.












Click it and Unblock the Notifications