రూ.15 లక్షలు చోరీ.. పట్టపగలే దొంగల బీభత్సం.. ఎక్కడ అంటే..
దొంగల బీభత్సం కొనసాగుతూనే ఉంది. రాత్రి పూట అంటే ఏమో అనుకోవచ్చు.. మరీ పట్టపగలు.. ఆలోచించాల్సిందే.. అవును కరీంనగర్ నడిబొడ్డున మధ్యాహ్నమే దొంగలు హల్ చల్ చేశారు. భారీగా నగదును దోచుకెళ్లారు. ఈ కేసును పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. వీలైనంత త్వరగా కేసు ఛేదిస్తామని పోలీసు అధికారులు అంటున్నారు.
దొంగలు యథేచ్చగా దోపిడీకి పాల్పడుతున్నారు. రాత్రిళ్లే కాదు పట్టపగలు కూడా చేతివాటం చూపిస్తున్నారు. కరీంనగర్‌లో పట్టపగలే భారీ చోరీకి పాల్పడ్డారు. పక్కాగా రెక్కీ నిర్వహించి మరీ చోరీ చేశారు. దోచుకెళ్లిన నగదు పెద్ద మొత్తం కావడం విశేషం. రూ.15 లక్షలు దోచుకెళ్లడంతో బాధితుడు లబోదిబో మంటున్నాడు.

ఒకతను కలెక్టరేట్ ఎస్బీఐ బ్యాంకు నుంచి సోమవారం రూ.15లక్షలు డ్రా చేశాడు. గమనించిన దొంగలు ఆ వ్యక్తిని వెంబడించారు. నగదు ఉంది అని నిర్ధారించుకున్నారు. కరీంనగర్ గీతాభవన్ చౌరస్తాలో ఆ నగదును చోరీ చేశారు. దొంగతనంపై బాధితుడు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.
సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ ఆధారంగా దుండగులను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. దొంగలు పక్కాగా రెక్కీ నిర్వహించారు. ఆ తర్వాతే దోచుకున్నారు. చోరీ స్థానికంగా చర్చకు దారితీసింది.బిక్కుబిక్కుమని స్థానికులు ఉంటున్నారు. దొంగలు పట్ట పగలే తెగించారు. అప్పటికీ పోలీసులు ఉంటారు. గీతభవన్ వద్ద జనం రద్దీ కూడా ఉంటుంది. అయినా వారు దోపిడి చేశారంటే మాములు విషయం కాదు. వారిని తొందరగానే పట్టుకుంటామని చెబుతున్నారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications