తెలంగాణ ధనిక రాష్ట్రమని ఇంకా నమ్ముతున్నారా- అసలు విషయం చెబుతా: జేపీ నడ్డా
కరీంనగర్: భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, కరీంనగర్ లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్ చేపట్టిన అయిదో విడత పాదయాత్ర ఇవ్వాళ్టితో ముగిసింది. కిందటి నెల 28వ తేదీన నిర్మల్ జిల్లా భైంసాలో బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమైంది. అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళన తలెత్తింది. భైంసా నుంచి బండి సంజయ్ పాదయాత్ర చేపట్టడానికి పోలీసులు అడ్డుకోవడం, ఆయనను అరెస్ట్ చేయడం, ఆ తరువాత కోర్టు నుంచి అనుమతి తీసుకుని పాదయాత్రను మొదలు పెట్టడం వంటి పరిణామాలు సంభవించాయి.
ఈ 18 రోజుల పాటు సాగిన పాదయాత్ర ఇది. అయిదు జిల్లాల మీదుగా సుమారు 200 కిలోమీటర్ల మేర కాలినడకన పర్యటించారు బండి సంజయ్. భైంసాలో ఆరంభమైన ఈ పాదయాత్ర ఉత్తర తెలంగాణలోని నిర్మల్, ఖానాపూర్, వేములవాడ, జగిత్యాల, చొప్పదండి, ముథోల్, కరీంనగర్ నియోజకవర్గాల్లో కొనసాగింది. ముగింపు సందర్భాన్ని పురస్కరించుకుని తన సొంత లోక్‌సభ నియోజకవర్గం కరీంనగర్‌లో బండి సంజయ్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
Addressing the public meeting in Karimnagar, Telangana.#PrajaSangramaYatra5 https://t.co/Vg8fvBmM1g
— Jagat Prakash Nadda (@JPNadda) December 15, 2022
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టే కనిపిస్తోంది బీజేపీ ఈ సభతో. దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్యఅతిథిగా హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేసీఆర్ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. ఘాటు విమర్శలను సంధించారు. ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. భారత్ రాష్ట్ర సమితి ఏర్పాటుపైనా జేపీ నడ్డా ఆరోపణలను గుప్పించారు.
కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ నిరుపేద రాష్ట్రంగా మారిందని జేపీ నడ్డా చెప్పారు. ఇప్పటికీ తెలంగాణ ధనిక రాష్ట్రంగా భావించడం ఏ మాత్రం సరికాదని పేర్కొన్నారు. పది సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో రాష్ట్రం దోపిడీకి గురైందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తోన్న విధానాల వల్ల తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందని మండిపడ్డారు. ఆదాయాన్ని పెంచామంటూ కేసీఆర్ చెప్పుకోవడం అబద్ధమని స్పష్టం చేశారు జేపీ నడ్డా.

దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వారి అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం పని చేస్తోందని జేపీ నడ్డా పేర్కొన్నారు. ఒక దళిత మహిళను రాష్ట్రపతి స్థానంలో కూర్చోబెట్టిన ఘనత తమ పార్టీకి ఉందని అన్నారు. దళిత మహిళ రాష్ట్రపతి అవుతారని ఎవరైనా, ఎప్పుడైనా ఊహించారా? అని ఆయన ప్రశ్నించారు. అదే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. సబ్ కా సాథ్, సాథ్ వికాస అనే నినాదంతో తాము పని చేస్తోన్నామని వివరించారు.












Click it and Unblock the Notifications