కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కమలంపై హరీశ్ నిప్పులు: కడుపులో పెట్టుకుంటాం అని హామీ

|
Google Oneindia TeluguNews

హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం మరింత హీటెక్కింది. నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. మంత్రి హరీశ్ రావు, ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్దం కంటిన్యూ అవుతోంది. హుజూరాబాద్ మండలం కన్నుక గిద్దే, జోపాకలో మంత్రి హరీశ్‌ రావ్ ప్రచారం నిర్వహించారు. 'కారులో ఎక్కించే టీఆర్ఎస్‌కి ఓటు వేద్దామా..? కారుతో తొక్కించే బీజేపీకి ఓటు వేద్దామా..? ధరలు పెంచే పార్టీ బీజేపీకి ఓటు వేద్దామా..? పేదలను కడుపులో పెట్టుకుని చూసే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేద్దామా..?. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ మీద కొట్లాడే శక్తి లేక బీజేపీ- కాంగ్రెస్ ఏకమైందని హరీశ్ రావు విరుచుకుపడ్డారు.

మేమే ఉంటాం..

మేమే ఉంటాం..

ఎవరో ఏడ్చారని, తిట్టారని, సెంటిమెంట్ మాటలకు పడిపోవద్దు. రెండున్నర సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందని మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు. ఏం చేస్తామో చెప్తాం. బీజేపీ కూడా గెలిస్తే ఏం చేస్తారో చెప్పాలని అడిగారు. ఈటల రాజేందర్ రాజీనామా ఎందుకు చేశారని ప్రశ్నించారు. హుజూరాబాద్‌కు మెడికల్ కాలేజి కావాలని, జిల్లా కావాలని రాజీనామా చేశారా?. గెల్లు గెలిస్తే హూజూరాబాద్ ప్రజలకు లాభం. ఈటల గెలిస్తే బీజేపీకి లాభం. దేశంలో 18 బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. ప్రధాని స్వంత రాష్ట్రం గుజరాత్‌లో ఎక్కడైనా రూ. 2వేలు ఇస్తున్నారా? అని అడిగారు కేవలం రూ. 600 పెన్షన్ ఇస్తున్నారు. పేదింటి ఆడపిల్లకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నాం అని చెప్పారు. బీజేపీ రాష్ట్రాల్లో ఎక్కడైనా పేదింటి ఆడపిల్లకు ఒక్క రూపాయి సాయం చేస్తున్నారా. కళ్యాణ లక్ష్మి కడుపు నింపదు అంటున్నడు రాజేందర్, మీరు చెప్పండి కళ్యాణ లక్ష్మి వద్దా..? కావాలనుకునే వాళ్లు రాజేందర్‌ను చిత్తు చిత్తుగా ఓడించాలని కోరారు.

అప్పుడేం చేశారు..

అప్పుడేం చేశారు..

మంత్రిగా ఉన్నప్పుడు ఈటల రాజేందర్ ఒక్క ఇళ్లు కట్టలేదు. గెల్లు శ్రీనును గెలిపిస్తే మీ జాగాలో మీకే ఇళ్లు కట్టించే కార్యక్రమం చేయిస్తా. 30 తేదీ వరకే ఓట్లు. సీఎంగా కేసీఆర్ ఉంటారు. ఆర్థిక మంత్రిగా ఉంటానని భరోసానిచ్చారు. మాట తప్పితే మీరు ఊరుకుంటారా?. మంత్రిగా పనిచేయని రాజేందర్, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చేస్తారా?. కేంద్రం 21 రోజుల్లో 16 సార్లు పెట్రోల్, డీజీల్ ధరలు పెంచిందని గుర్తుచేశారు. గ్యాస్ సిలిండర్ ధర బాగా పెంచారు. బీజేపీకి ఓటు వేయడం అంటే వేయి రూపాయల సిలిండర్ ధర పెంచడాన్ని ఓప్పుకోవడమే కదా అని మంత్రి హరీష్‌ రావు అన్నారు.

విజయమో..

విజయమో..

హుజూరాబాద్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్టోబర్ 8వరకు నామినేషన్ దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13గా ప్రకటించారు. అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల నిర్వహిస్తారు. నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటిస్తారు.

ఏమీ జరుగునో

ఏమీ జరుగునో


హుజురాబాద్‌లో విజయం టీఆర్ఎస్- బీజేపీకి తప్పనిసరి. గెలుపు కోసం ఆ రెండు పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అధికార పార్టీకి విజయం కంపల్సరీ.. లేదంటే మొహం చూపించుకునే పరిస్థితి ఉండదు. ఇక బీజేపీ పరిస్థితి అయితే మరీ దారుణం.. పార్టీకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ.. అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మాత్రం జీవన్మరణ సమస్యే.. ఎందుకంటే ఆయన ఓడిపోతే రాజకీయంగా కోలుకోలేని దెబ్బ.. ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరీ హుజురాబాద్ ప్రజలు ఏం తీర్పు చెప్పనున్నారో చూడాల్సిందే.

దళితబంధుకు బ్రేక్

దళితబంధుకు బ్రేక్

హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ. కానీ ఈసీ దళితబంధు పథకానికి బ్రేక్ ఇచ్చింది.

English summary
telangana minister harish rao slams bjp party. they are not fullfill guarantees
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X