Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కరీంనగర్ ప్రజలకు క్షమాపణలు చెప్పిన ‘ది కేరళ స్టోరీ’ దర్శకుడు: ఎందుకంటే?

హైదరాబాద్: దేశంలో సంచలనం సృష్టిస్తున్న 'ది కేరళ స్టోరీ' సినిమా దర్శకుడు సుదీప్తో సేన్(Sudipto Sen) కరీంనగర్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఆదివారం కరీంనగర్‌లో నిర్వహిస్తున్న హిందూ ఏక్తా ర్యాలీలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే, అస్వస్థతకు గురైన కారణంగా ఆయన ఈ కార్యక్రమానికి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన క్షమాపణలు చెబుతూ ట్విట్టర్ వేదికగా కారణం వెల్లడించారు.

'ఈరోజు(ఆదివారం) మేం(ది కేరళ స్టోరీ టీమ్) కరీంనగర్ రావాల్సి ఉంది. మా సినిమా గురించి చర్చించాల్సి ఉంది. కానీ, ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో రాలేకపోతున్నా. కరీంనగర్ ప్రజలకు క్షమాపణలు తెలియజేస్తున్నా. మన కుమార్తెలను రక్షించేందుకు మేం ఈ సినిమా తెరకెక్కించాం. దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి' అని సుదీప్తో సేన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.

The Kerala Story director Sudipto Sen apologizes to Karimnagar people

కాగా, సుదీప్తో సేన్, ఆదా శర్మకు ఓ రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయయి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, దర్శకుడు మాత్రం తన అస్వస్థతపై క్లారిటీగా చెప్పలేదు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.

ఇది ఇలావుంటే, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో 'హిందూ ఏక్తా యాత్ర' జరుగుతోంది. హిందూ ధర్మ రక్షణ కోసం పాటపడేందుకే ఈ యాత్ర అని బండి సంజయ్ తెలిపారు. ఈ యాత్రలో పాల్గొనేందుకు అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో ఆయనకు బీజేపీ నేతలు స్వాగతం పలికారు. ఆ తర్వాత కరీంనగర్‌కు బయల్దేరారు.

అసోం సీంతోపాటు బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్, బీజేపీ ముఖ్య నేతలతోపాటు ది కేరళ స్టోరీ టీంకు కూడా బండి సంజయ్ ఆహ్వానం పంపారు. దీంతో వారు కూడా కరీంనగర్ రావాల్సి ఉన్నప్పటికీ.. అస్వస్థత కారణంగా రాలేకపోయారు. కాగా, ది కేరళ స్టోరీ.. లవ్ జిహాద్ నేపథ్యంలో రూపొందిన సినిమా. కేరళలో కొన్నేళ్లుగా 32వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడనే ఇతివృత్తవంతో తెరకెక్కింది ది కేరళ స్టోరీ.

విడుదలకుముందే వివాదాస్పదమైనప్పటికీ.. విడుదల తర్వాత రికార్డులు సృష్టిస్తోంది. మే 5న విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 112 కోట్లు రాబట్టింది. ఈ సినిమాలో ఆదా శర్మ, సిద్ది ఇద్నానీతోపాటు పలువురు నటులు ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగులో కూడా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అయితే, ఈ సినిమాలో వాస్తవం లేదని కొందరు విమర్శిస్తుండటం గమనార్హం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+