Karimnagar News: పొలం దున్నుతుండగా బావిలో పడిన ట్రాక్టర్.. ఒకరు మృతి..
పొలం దున్నుతూ ట్రాక్టర్ బావిలో పడిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. నకొండూర్ మండలం బంజేరుపల్లి గ్రామానికి చెందిన కాంపల్లి శంకర్(50) పాలేరు పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శంకర్‌కు భార్య లక్ష్మీ, ఇద్దరు కూతుళ్లు పూజ, అంజలి ఉన్నారు. జూన్ 6న శంకర్‌కు దళిత బంధు కింద ట్రాక్టర్ వచ్చింది. శంకర్‌కు డ్రైవింగ్‌కు రాకపోవడంతో తిమ్మాపూర్ మండలంలోని మహాత్మానగర్‌కు చెందిన మల్లేశాన్ని డ్రైవింగ్ నేర్పించాలని కోరాడు. దీంతో శంకరయ్య గురువారం మధ్యాహ్నం ట్రాక్టర్‌ను తిమ్మాపూర్ కు తీసుకొచ్చాడు.
తిమ్మాపూర్‌లోని ఓ రైతుకు చెందిన వ్యవసాయ భూమి వద్ద మల్లేశం శంకర్‌కు ట్రాక్టర్‌ను నేర్పిస్తుండగా 3.30గంటల సమయంలో శంకర్ ట్రాక్టర్ నడుపుతుండగా అదుపు తప్పి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడింది. ట్రాక్టర్ సహ శంకర్, మల్లేశం బావిలో పడ్డారు. మల్లేశంకు ఈత రాగా అతను బతికాడు. ఇదంతా అక్కడే ఉన్న పశువుల కాపరి చూసి పక్క రైతులందరికీ సమాచారం అందించారు. కానీ అప్పటికే ట్రాక్టర్, శంకర్ పూర్తిగా నీట మునిగి కనిపించలేదు. ఘటనా స్థలికి చేరుకున్న ఎల్‌ఎండీ పోలీసులు క్రేన్, గజ ఈతగాళ్ల సాయంతో ట్రాక్టర్ బయటకు తీయడానికి ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు.

5 గంటల పాటు శ్రమించినా ప్రయత్నాలు ఫలించలేదు. అప్పటికే పూర్తిగా చీకటిపడడం, అందులోనూ వర్షం రావడంతో ట్రాక్టర్, శంకర్‌ను బావిలో నుంచి తీయడం కుదరలేదు. శుక్రవారం ఉదయమే మోటార్ల సాయంతో నీటిని తోడి ట్రాక్టర్‌ను, శంకర్ మృతదేహాన్ని బయటకు తీశారు. శంకర్ కు దళిత బంధు పథకం కింద గత నెల 6న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వారికి ట్రాక్టర్‌ను అందజేశారు. ట్రాక్టర్ వచ్చిందని సంతోషపడేలోపే ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ప్రమాదం జరిగిందని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.












Click it and Unblock the Notifications