ఆయన రాజ్యసభ పేదోడా?.. కేసీఆర్ 'సంతోషా' నికి మిడ్ మానేరు భూములా?
కరీంనగర్ : రాజ్యసభలో పేదోళ్లుంటారా.. దారిద్ర్య రేఖకు దిగువన కుటుంబాలకు పెద్దల సభలో ఛాన్స్ దొరుకుతుందా? వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చుంటే ఏముంది అనే రీతిలో టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీకి ఆ భూములు కట్టబెట్టారా? కోట్ల రూపాయలు ఆర్జించి సంఘంలో పెద్దోడిగా చలామణీ అవుతున్న ఎంపీని అధికారులు పేదోడిగా గుర్తించారా? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు మిడ్ మానేరు ప్రాజెక్టు పునరావాస ప్యాకేజీలో పేదోళ్ల స్థానంలో పెద్దోళ్లు కర్చీఫ్ వేశారనే ఆరోపణలు సమాధానంగా కనిపిస్తున్నాయి.

పునరావాసం ఎవరికి.. పేదోళ్లకా, పెద్దోళ్లకా?
మిడ్ మానేరు ప్రాజెక్టు పునరావాస ప్యాకేజీలో పేదోళ్లను మరిచి పెద్దోళ్లకు భూములు కట్టబెడుతున్నారనే ఆరోపణలు జోరందుకున్నాయి. నిబంధనలను అతిక్రమిస్తూ అనర్హులకు భూములు కట్టబెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్, ఆయన సోదరితో పాటు మరో బంధువుకు అప్పనంగా భూములు కేటాయించారని నిర్వాసితులు మండిపడుతున్నారు.
మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన పేదల కోసం ఉద్దేశించిన పునరావాస ప్యాకేజీ దారి తప్పుతోందనేది నిర్వాసితుల వాదన. దారిద్ర్య రేఖకు దిగువన (Below Poverty Line) ఉన్న కుటుంబాలకు ఇవ్వాల్సిన భూముల్ని పెద్దోళ్లు గద్దల్లా తన్నుకుపోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఎంపీపై అధికారుల ప్రేమ.. పేదోడిగా గుర్తించడంపై నిర్వాసితుల ఆగ్రహం
టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌పై ప్రేమ కురిపించిన అధికారులు అతడిని పేదోడిగా గుర్తించారని ఫైరవుతున్నారు నిర్వాసితులు. అతడికి కొదురుపాకలోని సర్వే నెంబర్ 317లో 242 గజాల స్థలం కేటాయించడం వివాదస్పదమైంది. అంతేకాదు ఆయన సోదరి జోగినిపల్లి సౌమ్యకు కూడా అదే సర్వే నెంబర్‌లో మరో 242 గజాల స్థలం కేటాయించారని.. వారి సమీప బంధువు గండ్ర రమణారావుకు సర్వే నెంబర్ 366లో 242 గజాల స్థలం కేటాయించడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు.
మిడ్ మానేరు ప్రాజెక్టు పునారావాసం కింద.. మంచి స్థాయిలో ఉన్న ఆ ముగ్గురిని బీపీఎల్ కింద పరిగణిస్తూ భూములు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని వాపోతున్నారు నిర్వాసితులు.

అధికారుల అత్యుత్సాహం.. పైరవీకారులకే న్యాయం?
నిబంధనలు తుంగలో తొక్కిన అధికారులు.. ఆ ముగ్గురికి భూములు కేటాయించి అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపిస్తున్నారు. అసలు రూల్స్ ప్రకారం 2008 సంవత్సరానికి ముందు మూడేళ్ల నుంచి గ్రామంలో నివసించకుంటే పునరావాస ప్యాకేజీ వర్తించదని గుర్తు చేస్తున్నారు. సంతోష్ కుమార్ హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకుని చాలా ఏళ్లయిందని.. అయినా అదేమీ పట్టించుకోకుండా అధికారులు ఇలా పునరావాస ప్యాకేజీలో ఆయనకు చోటు కల్పించారని మండిపడుతున్నారు.
అదలావుంటే పెళ్లిళ్లు చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయిన మహిళలకు పునరావాస ప్యాకేజీ వర్తించదని చెబుతున్న అధికారులు.. సంతోష్ కుమార్ సోదరి సౌమ్యకు మాత్రం అందులో చోటు కల్పించడం న్యాయమేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ముగ్గురికే కాదు పైరవీ చేసుకున్నోళ్లకు పునారావాస ప్యాకేజీలో భాగంగా అధికారులు భూములు కేటాయిస్తున్నారని.. అసలైన అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications