Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యూజ్ లెస్ ఫెలో అంటూ మున్సిపల్ కమీషనర్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీరంగం

యూజ్ లెస్ ఫెల్లో అంటూ మున్సిపల్ కమీషనర్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీరంగం వేశారు . నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఉన్నతాధికారి అన్న విచక్షణ మరచి మరీ తిట్టి పోశారు. అంతే కాదు వార్నింగ్ కూడా ఇచ్చారు.

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈనేపధ్యంలోనే కరీం నగర్ జిల్లా చొప్పదండి మున్సిపల్ కమిషనర్‌ రాజేంద్ర కుమార్‌పై ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ ప్రగతిపై సమాచారం ఇవ్వలేదంటూ ఆయన మండిపడ్డారు . యూజ్ లెస్ ఫెల్లో, నీకసలు తలకాయ ఉందా అంటూ రాజేంద్రకుమార్‌పై ఎమ్మెల్యే రవిశంకర్‌ కమీషనర్ పై మండిపడ్డారు.

 Useless Fellow... TRS MLA fires on Municipal Commissioner

పట్టణ ప్రగతి ప్రారంభమై రెండు రోజులు గడుస్తున్నా స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వాలని జ్ఞానం లేదా అంటూ ఫైర్ అయ్యారు. పనుల పురోగతిపై తమకు కనీస సమాచారం ఇవ్వలేదంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇక ఇలాంటి తమాషాలు, పిచ్చి వేషాలు వేయొద్దని మున్సిపల్ కమిషనర్‌కు ఎమ్మెల్యే వార్నింగ్‌ ఇచ్చారు. పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కమీషనర్ తీరుపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని చెప్పిన ఆయన మున్సిపల్ కమీషనర్ అని కూడా చూడకుండా తిట్టిపోశారు. ఇప్పుడు ఈ ఘటన అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+