కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఖబడ్దార్ కేసీఆర్.. అప్పుల తెలంగాణగా మార్చారు.. వైఎస్ షర్మిల విసుర్లు

|
Google Oneindia TeluguNews

కరీంనగర్ జిల్లా పర్యటనలో వైఎస్ షర్మిల బిజీ బిజీగా గడిపారు. ఎల్లారెడ్డి గూడ, అల్మాసపూర్ గ్రామాల్లో షర్మిల పర్యటించారు. పేదల పాలిట వరం ఆరోగ్య శ్రీ.. ఆ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘటన వైఎస్ఆర్‌దేనని చెప్పారు. ఇవాళ ఆరోగ్య పరిస్థితి వర్ణతీతంగా ఉందన్నారు. కరోన వచ్చిన పట్టించుకునే నాథుడే లేడన్నారు. వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై లేదా అని ప్రశ్నించారు.

ప్రభుత్వమే కారణం..?

ప్రభుత్వమే కారణం..?

అప్పులు చేసి కుటుంబాలు రోడ్డునా పడటానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం అని విమర్శించారు. ఆరోగ్య శ్రీ కార్డ్ ఉండి కూడా అప్పులు పాలయ్యారని.. అందుకు కారణం కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చకపోవడమేనని చెప్పారు. ఇందుకు ప్రభుత్వం కారనం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు టీచర్‌గా పని చేస్తూ రూపాయి రూపాయి సంపాదించి మొత్తం హాస్పిటల్‌లో బిల్లునులు కట్టలేక మానసిక క్షోభ గురయ్యారు అని చెప్పారు.

రూ.20 లక్షల బిల్లులు

రూ.20 లక్షల బిల్లులు

సామాన్యులకి 10 నించి 20 లక్షలు కరోన బిల్లులు వేస్తే వాళ్ళు ఇల్లు, వాకిళ్లు తాకట్టు పెట్టి.. చివరకు వల్ల శవాలను తీసుకొస్తున్నారని చెప్పారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం యశోద ఆసుపత్రికి వెళతారని చెప్పారు. పేదలు మాత్రం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి లక్షలు లక్షలు కట్టాలా అని అడిగారు. కరోన వల్ల మృతిచెందిన వారికి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఫామ్‌హౌస్ నుంచి బయటకు రా.. దొర

ఫామ్‌హౌస్ నుంచి బయటకు రా.. దొర

ఆయుష్ మాన్ భారత్ దిక్కుమలింది అని కేసీఆర్ పదే పదే పాలికేవారన్నారు. ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి పేద వాడి కన్నీళ్లు చూడాలని షర్మిల కోరారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని కోరారు. ఎన్నికల పైన ఉన్న సోయి పేద ప్రజల ప్రాణాలపైన లేదా అడిగారు.

వైస్సార్ గొప్ప గురించి అందరికి తెలుసు అని.. అతని గురించిమాట్లాడే హక్కు మీకు లేదన్నారు. ఖబడ్దార్ కెసీర్.. ఇది బంగారు తెలంగాణ కాదు ..అప్పుల తెలంగాణ అని ఫైరయ్యారు. స్కూల్ ఇపుడు తెరవడం వల్ల యూజ్ ఉందా అని అడిగారు. పిల్లలు ప్రాణాలకి ముప్పు ఉంది అని చెప్తున్నందున.. విరమించుకోవాలని కోరారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు.

పరామర్శ

పరామర్శ

ఇటీవల రోడ్ ప్రమాదం లో మరణించిన అరుట్ల విక్రమ్ రెడ్డి కుటుంబాన్ని కరీంనగర్ జిల్లాలో పర్యటనలో భాగంగా వైఎస్ షర్మిల పరామర్శించారు. ఎల్లారెడ్డి గూడ మండలం, పదిరే గ్రామంలో ఉన్న విక్రమ్ కుటుంబ సభ్యులను షర్మిల కలిశారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు

English summary
ys sharmila slams cm kcr on coronavirus and another issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X