పౌష్టికాహారం అడగడమే పాపమా? అంగన్‌వాడీ కార్యకర్త దాడితో గర్భస్రావం..!
ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. పౌష్టికాహారం అడగడమే ఆమె పాలిట శాపమైంది. టేకులపల్లి మండలం మద్దిరాల తండాకు చెందిన బానోత్ పద్మ గర్భిణీ కావడంతో ప్రభుత్వం సరఫరా చేసే కోడిగుడ్ల కోసం అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లింది. తనకు వచ్చే కోటా ఇవ్వాల్సిందిగా అక్కడి ఆయాను కోరింది. దీంతో కోడిగుడ్లు లేవంటూ ఆమె దురుసుగా ప్రవర్తించింది.
పౌష్టికాహారం ఇవ్వాలంటూ పద్మ పట్టుబట్టడంతో ఆయా ఆగ్రహంతో ఊగిపోయింది. ఆమెతో ఘర్షణకు దిగింది. అంతేకాదు గర్భిణీ అని చూడకుండా విచక్షణరహితంగా దాడిచేసింది. అక్కడే ఉన్న ఆయా భర్త కూడా పద్మపై దాడి చేసినట్లు సమాచారం. పౌష్టికాహారం కోసం వస్తే గర్భిణీ అని చూడకుండా పద్మను తీవ్రంగా కొట్టడం స్థానికంగా కలకలం రేపింది.

అంగన్‌వాడీ ఆయా దాడితో బాధితురాలికి తీవ్రగాయాలయ్యాయి. వైద్యం కోసం ఆమెను కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. దెబ్బలు బాగా తగలడంతో పద్మకు గర్భస్రావం అయింది. దాడి జరిగిన సమయంలో అంగన్‌వాడీ టీచర్ అక్కడే ఉన్నా.. అడ్డుకోలేకపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications