ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీకి సీఎంగానే ఉంటా, ఇక్కడ పెత్తనం చేయను: చంద్రబాబు నోట జై తెలంగాణ, వేదికపై రాహుల్ గాంధీ

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018 : ఏపీకి సీఎంగానే ఉంటా, ఇక్కడ పెత్తనం చేయను : చంద్రబాబు | Oneindia Telugu

ఖమ్మం: తాను మొట్టమొదటిసారి ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో ఖమ్మంలో వేదిక పంచుకున్నానని, ఇది చారిత్రాత్మకమని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇది చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. దేశంలో అన్ని పార్టీలు ఎన్డీయేకు వ్యతిరేకంగా పని చేయాలని చెప్పారు. అందుకే తెలుగు రాష్ట్రాలలో ప్రజాకూటమితో ప్రారంభించామని చెప్పారు. దేశం బాగుంటే మనం బాగుంటామని, దేశం బాగాలేకపోతే మన మనుగడ కష్టమన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందన్నారు. రాష్ట్ర విభజనను తాను వ్యతిరేకించలేదన్నారు.

<strong>తెలంగాణ ఎన్నికలు: ఏ సర్వే ఏం చెబుతోంది, వారికి ఊహించని షాక్ తప్పదా?</strong>తెలంగాణ ఎన్నికలు: ఏ సర్వే ఏం చెబుతోంది, వారికి ఊహించని షాక్ తప్పదా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహాకూటమి లేదా ప్రజా కూటమి ఖమ్మం జిల్లాలో బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు కూటమి నేతలు హాజరయ్యారు. ఈ వేదికపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఏఫీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి, ప్రజా యుద్ధ నౌక గద్దర్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తదితరులు హాజరయ్యారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడారు.

ఈ సభ చరిత్రలో నిలిచిపోతుంది

ఈ సభ చరిత్రలో నిలిచిపోతుంది

ప్రధాని మోడీ హయాంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని చంద్రబాబు అన్నారు. రూపాయి విలువ పడిపోయిందని చెప్పారు. సీబీఐ, ఈడీ, ఆర్బీఐ వంటి సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేసిందన్నారు. తాను, రాహుల్ గాంధీ కలిసిన ఈ ఖమ్మం సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తెలంగాణ ప్రజలు తనను ఎంతగానే అభిమానించారని చెప్పారు. తొమ్మిదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నానని చెప్పారు. తనకు ఇచ్చిన గౌరవాన్ని జీవితంలో మరిచిపోనని చెప్పారు.

చారిత్రక అవసరం కోసం కాంగ్రెస్‌తో కలిశా

చారిత్రక అవసరం కోసం కాంగ్రెస్‌తో కలిశా

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిశాయని బాబు చెప్పారు. ముప్పై ఏళ్ల పాటు కాంగ్రెస్‌తో పోరాడిన తాము దేశ అవసరాల కోసం కలిశామని అన్నారు. విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు న్యాయం కావాలని తాను అడిగానని చెప్పారు. విభజన జరిగినా తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలన్నారు. ఖమ్మం సభ.. నూతన చరిత్రకు శ్రీకరం అన్నారు. చారిత్రక అవసరం దృష్ట్యా కాంగ్రెస్ పార్టీతో కలిసి వేదిక పంచుకున్నామని చెప్పారు. దేశంలో మైనార్టీలు అభద్రతా భావంలో ఉన్నారని చెప్పారు. తాము త్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకించామని, అందులో లోపాలు ఉన్నాయని చెప్పారు.

 తెలంగాణ నాకు ప్రియమైన ప్రాంతం

తెలంగాణ నాకు ప్రియమైన ప్రాంతం

నేను ఎక్కడ ఉన్నా తెలంగాణ తనకు ప్రియమైన ప్రాంతమని చంద్రబాబు చెప్పారు. తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి వస్తే తాను పెత్తనం చేస్తానని కేసీఆర్ చెబుతున్నారని, అది అవాస్తవం అన్నారు. నేను ఏపీ సీఎంగా ఉంటానని, అలాగే తెలంగాణ హితం కోసం మీకు అండగా ఉంటానని అన్నారు. ప్రజాకూటమి గెలుపు తెలంగాణకు అవసరమని చెప్పారు. దేశంలో ఇప్పుడు రెండే ఫ్రంట్‌లు ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. ఒకటి ఎన్డీయే ఫ్రంట్, రెండు ఎన్డీయేతర ఫ్రంట్ అన్నారు. ఈ రోజు సెల్‌ఫోన్‌ను తయారు చేయడం సులభమని చెప్పారు. ఆ రోజు వీవీపాట్ యంత్రం మేమే పోరాడి తీసుకు వచ్చామన్నారు.రాష్ట్ర విభజనను నేను వ్యతిరేకించలేదని, సమన్యాయం చేయమని మాత్రమే చెప్పానని అన్నారు. తెలంగాణలో తాను పోటీ చేసేది లేదని చెప్పారు. కూటమి గెలిస్తే నేను పెత్తనం ఎలా చేస్తానని అన్నారు.

 హైదరాబాద్ కట్టానని నేను చెప్పలేదు

హైదరాబాద్ కట్టానని నేను చెప్పలేదు

తాను హైదరాబాద్ నగరాన్ని కట్టానని చెప్పినట్లుగా కేసీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కానీ తాను సైబరాబాద్ నగరాన్ని నిర్మించానని అన్నారు. హైటెక్ సిటీని నిర్మించానని అన్నారు. తాను తెలంగాణ అభివృద్ధిని ఎప్పుడూ అడ్డుకోలేదని చెప్పారు.
నూటికి నూరు శాతం కాదని, వెయ్యికి వెయ్యి శాతం ప్రజాకూటమి గెలుస్తుందని చంద్రబాబు చెప్పారు. ప్రజాకూటమి గెలుపు అవసరమా కాదా అన్నారు. మీరు భయపడితే శాశ్వతంగా నష్టపోతారని చెప్పారు.

 తెలంగాణ భవిష్యత్తు కోసం పని చేస్తానని...

తెలంగాణ భవిష్యత్తు కోసం పని చేస్తానని...

కేసీఆర్ తనను తిడుతున్నారని, ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదని, మీకు అర్థమైందా అని చంద్రబాబు సభికులను ఉద్దేశించి అడిగారు. నన్ను దూషించడం కేసీఆర్‌కు న్యాయమా అన్నారు. నేను ఏం తప్పు చేశానని అడిగారు. తెలంగాణ అభివృద్ధికి నేను సహకరించలేదా అన్నారు. టీడీపీ అనే పార్టీ లేకుంటే కేసీఆర్ అనే వాడు ఉండేవాడా అన్నారు. నాకు సభ్యత ఉందని, కాబట్టి నేను విమర్శించనని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం, దేశ భవిష్యత్తు కోసం పని చేస్తానని హామీ ఇస్తున్నానని చెప్పారు. తెలంగాణ బాగుపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు.

 చంద్రబాబు నోట జై తెలంగాణ

చంద్రబాబు నోట జై తెలంగాణ

తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణానికి అన్ని రకాలుగా సహకరిస్తానని చంద్రబాబు చెప్పారు. ఇక్కడ బీజేపీకి ఓట్లు లేవని, కానీ హెలికాప్టర్లు ఉన్నాయని చెప్పారు. వారు ఇక్కడ కూడా డబ్బు సంచులతో తిరుగుతున్నారని చెప్పారు. అందరూ ప్రజాకూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. చివరగా చంద్రబాబు మాట్లాడుతూ.. నేను జై తెలంగాణ అంటానని, మీరు జై జై తెలంగాణ అనాలని చెప్పారు. కేసీఆర్, మజ్లిస్ ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలన్నారు. మోడీ వైపు ఉంటారా అని నిలదీశారు. కేసీఆర్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే అన్నారు.

English summary
Andhra Pradesh Chief Minister and TDP national president Nara Chandrababu Naidu shared dias with Congress cheif Rahul Gandhi. He gave Jai Telangana slogans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X