Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వర్ష బీభత్సం.. గ్రేటర్‌లో 211 ప్రాంతాలపై ఫోకస్, చేపలు పట్టేందుకు జనం ఇంట్రెస్ట్

తెలంగాణ రాష్ట్రంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ముసురేసింది. దీంతో జనం బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌లో ముసురుతో జనం ఎక్కడివారు అక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాలతో జీహెచ్ఎంసీ, జలమండలి, డీఆర్‌ఎఫ్‌ అప్రమత్తం అయ్యింది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని జీహెచ్‌ఎంసీ సూచించింది.

211 ప్రాంతాలపై ఫోకస్..

211 ప్రాంతాలపై ఫోకస్..


గ్రేటర్‌లో వర్షం నీరు నిలిచే 211 ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. వర్షం నీటిని తొలగించేందుకు అధికారుల ఏర్పాట్లు చేశారు. ఎస్ఎన్డీపీ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టారు. హెల్ప్‌లైన్ నంబర్ 04 2111 1111ను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసింది. మ్యాన్‌ హోల్స్ తెరవవద్దని జలమండలి సూచించింది. మ్యాన్‌హోల్స్‌ మూత విరిగినా, తెరచి ఉన్నా.. సమాచారం ఇవ్వాలని హైదరాబాద్‌ వాటర్‌బోర్డ్ సూచించింది.

గ్రేటర్‌లో హై అలర్ట్

గ్రేటర్‌లో హై అలర్ట్


వర్షాలతో జీహెచ్ఎంసీ హై అలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం నుంచి గ్రేటర్‌ వ్యాప్తంగా విస్తరించింది. శనివారం కూడా వర్షం భారీగా కురుస్తుంది. శనివారం ముంపు ప్రాంతాల్లో నగర మేయర్ విజయ లక్ష్మి పర్యటించారు. ఈ నేపథ్యంలో రసూల్ పురా నాలాపనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మరో మూడు, నాలుగు రోజులపాటు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.

చేపలు పట్టేందుకు జనం ఉత్సాహం

చేపలు పట్టేందుకు జనం ఉత్సాహం


ఇటు ఖమ్మం జిల్లాలో వర్ష ప్రభావం ఉంది. వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, ఇతర జలాశయాలకు వరద పోటెత్తుతోంది. కొత్త నీటికి చేపలు ఎదురెక్కడంతో వాటిని పట్టుకునేందుకు జనాలు ఎగబడ్డారు. మాదారం చెరువు వద్దకు, నాచేపల్లి వాగుకి చేపల కోసం పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. నాచేపల్లి వంతెన వద్ద భారీగా జనం కనిపించారు. స్థానికులే కాదు, పరిసర గ్రామాల ప్రజలు చిన్న వలలతో ఉత్సాహంగా చేపలు పట్టారు. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో చేపలు ఎదురెక్కాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+