కరోనా ముందు లేచిపోయి..బతకలేక తిరిగొచ్చారు..ఇంతలో అలా జరిగిపోయింది..
కరోనా వైరస్ లాక్ డౌన్ తెచ్చిన సమస్యలు అన్నీ ఇన్నీ కావు. చివరికి అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారికి సైతం లాక్ డౌన్ సమస్యగా మారిపోయింది. అది కాస్తా చివరికి వారి ప్రాణాలను హరించే స్ధాయికి వెళ్లిన ఘటన తాజాగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. అక్రమ సంబంధం కారణంగా ఇద్దరు చనిపోవడంతో వారి పిల్లలు దిక్కులేని వారయ్యారు.
ఖమ్మం జిల్లా అనంతసాగర్ లో వేల్పుల వినోద రావు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు .అదే గ్రామానికి చెందిన రాంబాయి అనే వివాహితతో అక్రమ సంబంధం ఏర్పరుచుకున్నాడు. అయితే ఏకంగా వీరు అక్రమ సంబంధం సజావుగా సాగేందుకు పొరుగునే ఉన్ ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు వెళ్ళిపోయారు. అప్పుడప్పుడూ స్వగ్రామం వచ్చి వెళుతుండేవారు. అయితే కరోనా నేపథ్యంలో ఎక్కడా పనులు లేకపోవడంతో ఇద్దరూ స్వగ్రామం చేరుకుని ఎవరిళ్ళలో వాళ్ళు ఉంటున్నారు.

వారం రోజుల క్రితం అనంత సాగర్ కు వచ్చిన వినోద రావు అనూహ్యంగా గుండెపోటుతో చనిపోయాడు. అయితే అతని మృతికి అక్రమ సంబంధమే కారణం అని అంటూ బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. అతను అక్రమ సంబంధం పెట్టుకున్న రాంబాయి ఇంటికి వెళ్లి ఆమెను చితకబాదారు. వీరి దెబ్బలకు తాళలేక తీవ్ర గాయాలపాలైన రాంబాయి తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
దీంతో ఆమె పిల్లలు రోడ్డునపడ్డారు.
రాంబాయి చనిపోయిందని తెలిసి ఆమె బంధువులు వినోదరావు ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. రాంబాయి మృతికి కారకులైన వారిని అరెస్టు చేయాలని, వినోదరావుకు సంబంధించిన ఆస్తిపాస్తులు.. రాంబాయి పిల్లల పేర్లు రాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.