కురుక్షేత్ర యుద్దం చేస్తున్నా - పార్టీ మార్పు పై తేల్చేసిన పొంగులేటి ..!!
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేత పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేసారు. కొద్ది రోజులుగా పొంగులేటి బీఆర్ఎస్ నుంచి మరోపార్టికి మారుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. జనవరి 1న ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన సమయంలో పొంగులేటి పార్టీ మార్పు పైన సంకేతాలు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తనతో పాటుగా తనను నమ్ముకున్న వారికి పోటీ చేసే అవకాశం వస్తుందని భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో ప్రభుత్వం పొంగులేటి భద్రతను కుదించింది. దీంతో..సంక్రాంతి తరువాత రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని బీజేపీ నేతలు చెబుతున్న వేళ..మరోసారి పొంగులేటి స్పందించారు.

పొంగులేటి ఫైనల్ డెసిషన్
ఖమ్మం జిల్లాలలో బీఆర్ఎస్ నేతలు తుమ్మల - పొంగులేటి వేస్తున్న రాజకీయ అడుగులు ఆసక్తి కరంగా మారుతున్నాయి. మరి కొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తమతో పాటుగా అనుచరులకు టికెట్ల ఖరారు పైన తాజాగా పొంగులేటి కీటక ప్రకటన చేసారు. అనుచరులకు భరోసా ఇచ్చారు. తాను నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నా..ఏం జరుగుతుందో అందరూ చూస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే ప్రభుత్వం పొంగులేటికి సెక్యూరిట తగ్గించటంతో.. అధికార పార్టీకి పొంగులేటి పార్టీ మార్పు పైన సంకేతాలు అందటంతోనే...ఈ నిర్ణయం తీసుకుందనే చర్చ సాగింది. ఈ నిర్ణయం పైన బీజేపీ నేతలు స్పందించటం ఆసక్తి కరంగా మారింది. సంక్రాంతి తరువాత బీజేపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయంటూ పరోక్షంగా పొంగులేటి చేరిక పైన వ్యాఖ్యలు చేసారు.

పొంగులేటి స్పష్టమైన సంకేతాలు
ఇక, తాజాగా పొంగులేటి చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ ప్రయాణాన్ని స్పష్టం చేస్తున్నాయి. కురక్షేత్ర యుద్దానికి సిద్దంగా ఉన్నానని పొంగులేటి వెల్లడించారు.రాజకీయ నాయకుడు ఎవరైనా ప్రజల్లో మమైకం అయి ఉన్నప్పుడే ప్రజల దీవేనలు ఉన్నవాడే రాజకీయ నాయకుడిగా రాణించగలిగుతారని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కుటుంబ సభ్యులు ప్రతి ఇంట్లో తనను ప్రేమిస్తున్నారని.. వారి ప్రేమ పొందటం తనకు బలం అని చెప్పకొచ్చారు. భగవంతుడి దయతో మీ ప్రేమ వట్టిగా పోదంటూ వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఎమ్ కొరుకుంటున్నారో తప్పకుండా రాబోయే రాజకీయాల్లో అదే జరుగుతుందంటూ మరింత ఆసక్తిని పెంచారు. రాజకీయ చదరంగం..కురుక్షేత్ర యుద్దానికి సిద్దంగా ఉన్నానని పొంగులేటి స్పష్టం చేసారు.

సంక్రాంతి తరువాత పార్టీ మార్పు..?
అయితే, బీజేపీ నేతల నుంచి అందుతున్న సమాచారం మేరకు సంక్రాంతి తరువాత బీజేపీలో పొంగులేటి చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పుడు పొంగులేటి చేస్తున్న వ్యాఖ్యలు..ఇస్తున్న సంకేతాలు కూడా దీనినే స్పష్టం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ.. బీఆర్ఎస్ లో నేతలకు గాలం వేస్తోంది. అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో పొంగులేటి తో పాటుగా ఆయన అనుచరులు బీజేపీలోకి వచ్చేలా మంత్రాంగం సాగిందని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు పొంగులేటి వ్యాఖ్యలతో ఆయన కీలక నిర్ణయం తీసుకోబోతున్నారనే సంకేతాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. దీంతో..సంక్రాంతి తరువాత పొంగులేటి కాషాయం కండువా కప్పుకోవటం ఖాయమని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications