పొంగులేటిపై గులాబీ బాస్ వేటు..! మ‌రి ఖ‌మ్మం లోక్ స‌భ స్థానంలో ఎవ‌రికి చోటు..!!

ఖ‌మ్మం/ హైద‌రాబాద్ : అన్నీ ఉండి అల్లుడి నోట్లో శ‌ని అంటే ఇదేనేమో..! పార్టీ సంపూర్ణ మెజారిటీతో అదికారం లో ఉన్నా త‌న విష‌యానికి వ‌చ్చే స‌రికి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీచ‌డం భ‌రించ‌రాని నొప్పిగా ప‌రిణ‌మించొచ్చు. ఖ‌మ్మం ఎంపీ పొగులేటి శ్రీ‌నివాస రాడ్డి అంశంలో అచ్చం ఇలాంటి ప‌రిణామాలే చోటుచేసుకున్నాయి. పొంగ‌లేటి వైఖ‌రి వ‌ల్లే ఖ‌మ్మం జిల్లాలో మెజారిటి స్థానాలు కోల్పోయామ‌ని స్థానిక నేత‌లు ఇప్ప‌టికే గులాబీ బాస్ కి ఆధార‌ల‌తో స‌హా వివ‌రించిన‌ట్టు తెలుస్తోంది. దీంతో రాబోవు పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం లోక్ స‌భ స్థానానికి గులాబీ బాస్ ప్ర‌త్యామ్నాయం వెతుకుతున్న‌ట్టు స‌మాచారం. దీంతో పార్ల‌మెంట్ స్థానం పై ఇప్ప‌టినుండే ఉత్కంఠ ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి.

వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పొంగులేటికి నో టికెట్..! ప్ర‌త్యామ్నాయంలో టీఆర్ఎస్..!!

వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పొంగులేటికి నో టికెట్..! ప్ర‌త్యామ్నాయంలో టీఆర్ఎస్..!!

ముందస్తు ఎన్నికల ఫలితాలతో ఊపుమీదున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం సన్నద్ధం అవుతోంది. ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన ఆయన జాతీయ నేతలతో పలు దఫాలు చర్చలు కూడా జరిపారు. అంతేకాదు, ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ నిర్మాణం కూడా చేపట్టబోతున్నారు.

పొంగులేలి పార్టీ మారుతున్న‌ట్టు పుకార్లు..! ఖ‌మ్మంలోని ప్ర‌తి గుమ్మంలో ఇదే చ‌ర్చ‌..!!

పొంగులేలి పార్టీ మారుతున్న‌ట్టు పుకార్లు..! ఖ‌మ్మంలోని ప్ర‌తి గుమ్మంలో ఇదే చ‌ర్చ‌..!!

మరోవైపు, ఇటీవల వెలువడుతున్న సర్వేల ప్రకారం వచ్చే ఎన్నికల్లో హంగ్ ఏర్పడే అవకాశాలు ఉండడంతో రాష్ట్రంలోని మెజారిటీ ఎంపీ స్థానాలను గెలుచుకుని, ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటికే పలు వ్యూహాలకు ప‌దును పెడుతున్నారు గులాబీ నేత‌లు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాలకు గానూ 16 గెలవాలన్న పట్టుదలతో చంద్ర‌శేఖ‌ర్ రావు ఉన్నట్లు పలుమార్లు వెల్లడించారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీలకే దాదాపుగా సీట్లు కేటాయిస్తానని చెబుతున్నారు. అయితే, కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలతో చంద్ర‌శేఖ‌ర్ రావు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ స‌మాచారం.

లోక్ స‌భ స్థానాల‌కు దాదాపు సిట్టింగ్ అభ్య‌ర్థులే ఖ‌రారు..! ఒక‌టి రెండు స్థానాల్లో త‌ప్ప‌ని మార్పులు..!!

లోక్ స‌భ స్థానాల‌కు దాదాపు సిట్టింగ్ అభ్య‌ర్థులే ఖ‌రారు..! ఒక‌టి రెండు స్థానాల్లో త‌ప్ప‌ని మార్పులు..!!

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే టీఆర్ఎస్ అభ్యర్థులను ఫైనల్ చేసే ప్రక్రియను ప్రారంభించిన ఆ పార్టీ అధినేత, ఓ సిట్టింగ్ ఎంపీకి సీటు నిరాకరించబోతున్నారని సమాచారం. ఆయనే ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వర్రావుపై పది వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు పొంగులేటి కూడా అదికార పార్టీలో చేరిపోయారు.

పొంగులేటికి సీటు క‌ష్ట‌మే..! అసంత్రుప్తి గా ఉన్న అదిష్టానం..!!

పొంగులేటికి సీటు క‌ష్ట‌మే..! అసంత్రుప్తి గా ఉన్న అదిష్టానం..!!

పొంగులేటి టీఆర్ఎస్‌లో ఉన్నా ఆధిపత్య పోరు వల్ల ఆ పార్టీకి నష్టం చేకూర్చే పనులు చేస్తున్నారని, ముందస్తు ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ప్రతికూల ఫలితాలు రావడానికి ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డేనన్న ప్రచారం జరుగుతోంది. అలాగే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేర‌బోతున్న‌ట్టు ఖ‌మ్మం లోని ప్ర‌తి గుమ్మంలో చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. పొంగులేటి వ‌ల్లే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మొత్తం పది స్థానాల్లో టీఆర్ఎస్ ఒక్క చోట మాత్రమే విజయం సాధించిందని ఆ జిల్లాలోని నేతలు ఆరోపణలు చేస్తుండడడంతో, చంద్ర‌శేఖ‌ర్ రావు ప్ర‌త్యామ్నాయం దిశ‌గా ఆలోచిస్తున్న‌ట్టు స‌మాచారం. అయితే, ఆయన స్థానంలో ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారన్న అంశం మాత్రం ఉత్కంఠ‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+