తుమ్మల ప్రధాన అనుచరుడు, టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్య
ఖమ్మం: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు, టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య సోమవారం దారుణ హత్యకు గురయ్యారు. ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో బైక్‌పై ఆయన వెళుతుండగా.. కొందరు దుండగులు ఆటోతో ఢీకొట్టారు. ఆ తర్వాత కృష్ణయ్యను ఆరుగురు వ్యక్తులు వేటకొడవళ్లతో దాడి చేసి హతమార్చారు.
తెల్దారుపల్లి శివారులోని రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. రాజకీయ కక్షలే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. కాగా, కృష్ణయ్య ఆంధ్రా బ్యాంక్ కర్షక సేవా సహకార సంఘం డైరెక్టర్‌గా ఉన్నారు.

అయితే, కృష్ణయ్య హత్యకు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం సోదరుడు కోటేశ్వరరావు కారణమంటూ తెల్దారుపల్లికి చెందిన పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతేగాక, కోటేశ్వరరావు ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఆయన ఇంట్లోని ఫర్నీచర్, కిటికీలు ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా వారు వెనక్కి తగ్గలేదు.
కృష్ణయ్యను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. తనను చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయని ఇప్పటికే కృష్ణయ్య పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడని ఆయన బంధువులు చెబుతున్నారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications