Loan App: లోన్ యాప్ వేధింపులకు మరొకరు బలి.. అప్పు చెల్లించిన ఆగని బ్లాక్ మెయిల్..
లోన్ యాప్ వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మంలో జరిగింది.
పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఆన్‍లైన్ రుణ యాప్ లు కొకోల్లలుగా వస్తున్నాయి. అమాయకులకు అప్పు ఇచ్చి లక్షల్లో దండుకుంటున్నాయి. అప్పు తీర్చినా కూడా వేధింపులు ఆపడం లేదు. ఇలా రుణ యాప్ వేధింపులు తాళలేక చాలా మంది ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా ఖమ్మంలో ఓ యువకుడు ఆన్ లైన్ రుణ యాప్ వేధింపులకు బలయ్యాడు. పురుగు మందు తాగి బలన్మరణానికి పాల్పడ్డాడు. పురుగుల మందు తాగిన అతన్ని ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

సోషల్ మీడియా
ఖమ్మం జిల్లా బాపూజీ తండాకు చెందిన భూక్యా భావ్‌సింగ్ కుమారుడు ఆకాశ్ ఖమ్మంలోని ఓ బంగారం షాపులో పనిచేస్తున్నాడు. ఓ ఆన్‌లైన్ యాప్ లో అతను రూ.6 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఆ అప్పును సకాలంలో చెల్లించడంతోపాటుగా అదనంగా రూ.54 వేలు చెల్లించాడు. అయినా ఆన్ లైన్ రుణ యాప్ వేధింపులు ఆగలేదు. అప్పు చెల్లించకుంటే నీ ఫొటో, మీ కుటుంబ సభ్యుల ఫొటోలు సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారు.

ఈ నెల 9న
వేధింపులు ఎక్కువవడంతో ఆకాశ్ ఈ నెల 9న తాను పనిచేసే షాపు వెనుకనే పురుగు మందు తాగాడు. షాపు యాజమాన్యం గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రుణ యాప్ పట్ల జాగ్రత్తగా ఉండాలి పోలీసులు సూచిస్తున్నారు. రుణ యాప్ లకు చాలా వాటికి ఆర్బీఐ అనుమతి లేదు.

రూ.3 వేల రుణం
డిజిటల్ లెండింగ్‌పై RBI వర్కింగ్ గ్రూప్ భారతీయ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం దాదాపు 1,100 లెండింగ్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో దాదాపు 600 చట్టవిరుద్ధమైనగా ఉన్నాయి. తిరుపతికి చెందిన ఓ వ్యక్తి లోన్ యాప్ ద్వారా రూ.3 వేల రుణం తీసుకున్నారు. ఛార్జీలు పోగా రూ.2,200 నగదు ఖాతాకు జమ చేశారు. వారంలోపు డబ్బు చెల్లించాలని చెప్పాడు.

రూ.లక్షల్లో బాకీ
కానీ అతను డబ్బు చెల్లించకపోవడంతో.. వాళ్లే ఫోన్ చేసి మరో యాప్ ద్వారా ఇంకోసారి రుణం ఇచ్చి పాత బాకీ జమ చేయించుకున్నారు. ఇలా 19 యాప్‌ల ద్వారా 34 సార్లు రుణం ఇచ్చినట్లే ఇచ్చి చివరకు రూ.లక్షల్లో బాకీ ఉన్నట్లు చూపించారు. ఆ తర్వాత వేధింపులు మొదలు పెట్టారు.












Click it and Unblock the Notifications