వార్నీ: ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు డకౌటా?: ఆ క్రికెటర్ చెత్త రికార్డు: ఆడేసుకుంటోన్న ఫ్యాన్స్

దుబాయ్: సాధారణంగా ఒక మ్యాచ్‌లో ఒక బ్యాట్స్‌మెన్ ఒకేసారి అవుట్ అవుతుంటాడు. ఒకసారి డకౌట్ అయితేనే చులకనగా చూస్తారు ఫ్యాన్స్. అలాంటిది ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ దారి పడితే. ఇక ఓ ఆట ఆడేసుకుంటారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు పంజాబ్ బ్యాట్స్‌మెన్. ఒక మ్యాచ్‌లో రెండుసార్లు సున్నాకే అవుట్ కావడమనేది అత్యంత అరుదు. అన్ వాంటెడ్ రికార్డ్ అది. నైట్ మేర్. కల్లో కూడా వెంటాడుతుంటుంది. ఒక్కోసారి కేరీర్‌ మొత్తాన్నీ కొలాప్స్ చేస్తుంది. అలాంటి చెత్త రికార్డును సాధించిన ఆ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బ్యాట్స్‌మెన్.. నికొలస్ పూరన్.

తొలి మ్యాచ్‌లోనే ఘోరం

వెస్టిండీస్‌కు చెందిన ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ ఐపీఎల్-2020 సీజన్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున ఆడుతున్నాడు. మంచి రికార్డ్ ఉన్న ఆటగాడే. పించ్ హిట్టర్. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే చెలరేగిపోతుంటాడు. అందులో డౌట్ లేదు. ఒంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపించిన సందర్భాలూ ఉన్నాయి. ఈ ఐపీఎల్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఘోరంగా విఫలం అయ్యాడు. ఎంత ఘోరంగా అంటే.. ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు డకౌట్ అయ్యేంతగా. సూపర్ ఓవర్‌లోనూ సున్నాకే అవుట్ అయ్యాడు. దాని ప్రభావం పంజాబ్ టీమ్‌పై పడింది. ఓటమిని కొని తెచ్చుకున్నట్టయింది.

లక్ష్య ఛేదనలో..

ఢిల్లీ కేపిటల్స్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలో దిగిన పంజాబ్ టీమ్.. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ వల్ల మ్యాచ్ టై దాకా తీసుకెళ్లగలిగింది. పంజాబ్ టీమ్‌లో కేప్టెన్ కమ్ ఓపెనర్ కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, సర్ఫరాజ్ ఖాన్, కృష్ణప్ప గౌతమ్ వినహా మరెవరూ రెండంకెల స్కోర్‌ను అందుకోలేకపోయారు. పట్టుమని 10 పరుగులు కూడా చేయలేకపోయారు. ఒకవైపు కగిసో రబడా, మరోవైపు మార్కస్ స్టోయినిస్, ఇంకోవైపు రవిచంద్రన్ అశ్విన్ ముప్పేటదాడితో పంజాబ్ బ్యాట్స్‌మెన్లు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ క్రమంలోనే నికొలస్ పూరన్.. అవుట్ అయ్యాడు.

ఇన్నింగ్‌లో డకౌట్..

సెకెండ్ డౌన్ తరువాత క్రీజులోకి వచ్చిన నికొలస్ పూరన్.. కుదురుకోలేకపోయాడు. క్రీజ్‌లో పాతుకోలేకపోయాడు. మూడే బంతులను ఎదుర్కొని, పెవిలియన్ దారి పట్టాడు. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇన్నింగ్ అయిదో ఓవర్ వేసిన అశ్విన్.. రెండు వికెట్లను పడగొట్టాడు. తొలి బంతికి కరుణ్ నాయర్‌ను అవుట్ చేసిన అశ్విన్.. అయిదో బంతికి పూరన్‌ను బలి తీసుకున్నాడు. అశ్విన్ నుంచి వెలువడిన ఓ లెగ్ కట్టర్.. పూరన్ ప్యాడ్‌ను ముద్దాడుతూ బెయిల్స్‌ను గిరాటేసింది. ఆ బంతిని ఏ మాత్రం అంచనా వేయలేకపోయాడు పూరన్. డిఫెన్స్ చేయలేకపోయాడు. మూడు బంతుల్లో సున్నా పరుగులకు అవుట్ అయ్యాడు.

సూపర్ ఓవర్‌లోనూ క్లీన్ బౌల్డ్

సూపర్ ఓవర్‌లోనూ అదే పరిస్థితి. తప్పనిసరిగా భారీ స్కోరు చేసి తీరాల్సిన సూపర్ ఓవర్‌లో పంజాబ్ టీమ్.. రెండు పరుగులు మాత్రమే చేసిందంటే దానికి కారణం.. పూరనే. పూరన్ అవుట్ కావడం వల్ల పంజాబ్ టీమ్ ఆ ఓవర్‌లో మిగిలిన బంతులనూ ఆడలేకపోయింది. సూపర్ ఓవర్‌లో పంజాబ్ రెండు పరుగులే చేసి రెండు వికెట్లు కోల్పోయింది. సూపర్ ఓవర్ నిబంధనల ప్రకారం రెండు వికెట్లు కోల్పోతే ఆ ఓవర్ అక్కడితో ముగిసిపోతుంది. ఆదివారం నాటి మ్యాచ్‌లో అదే జరిగింది. తొలి బంతికి కేఎల్ రాహుల్ రెండు పరుగులు తీశాడు. రెండో బంతికి అవుట్ అయ్యాడు.

రాహుల్‌పై ఫ్యాన్స్ గుస్సా..

రాహుల్ తరువాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ మూడో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రబడా వేసిన బాల్‌ను భారీ షాట్ కోసం ప్రయత్నించాడు. అదికాస్త మిస్ అయింది. వికెట్లు గాల్లోకి లేచాయి. సూపర్ ఓవర్‌లో మయాంక్ అగర్వాల్‌ను కాదని పూరన్‌ను తీసుకోవడం పట్ల అభిమానులు కేఎల్ రాహుల్‌పై నిప్పులు చెరుగుతున్నారు. 90 బంతుల్లో 89 పరుగులు చేసి, మ్యాచ్‌ను టై దాకా తీసుకెళ్లిన మయాంక్‌ను సూపర్ ఓవర్‌లో డగౌట్‌కే పరిమితం చేయడం, ఇన్నింగ్‌లో సున్నాకే అవుటైన పూరన్ మీద డిపెండ్ కావడాన్ని తప్పు పడుతున్నారు. ట్రోల్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+