Badradri Kothagudem: గొంతులో మక్కలు ఇరుక్కుని చిన్నారి మృతి..
మక్కలు గొంతులో ఇరుక్కుని మూడేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.
చిన్నారి గొంతులో మక్కలు ఇరుక్కొని మృతి చెందిన విషాదకర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. చుంచుపల్లి మండలం రాంపురం గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారికి గొంతులో మొక్కజొన్న గింజలు ఇరుక్కొవడంతో ప్రాణాలు విడిచింది. వెంకటకృష్ణ, అశ్విని దంపతులకు కూతురు మూడేళ్ల బిందుశ్రీ ఉంది. వెంకటకృష్ణ, అశ్విని భోజనం చేస్తుండగా బిందుశ్రీ ఇంట్లో ఆడుకుంటుంది.
అయితే అంతకు ముందు వెంకటకృష్ణ మక్క కంకులు తీసుకొచ్చాడు. వారు మక్క కంకులు తింటుంగా మొక్కజొన్న గింజలు కిందపడ్డాయి. ఆ మక్కలను బిందుశ్రీ నోటిలో వేసుకుంది. అ మొక్కజొన్న గింజలు గొంతులో ఇరుక్కొని శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో బిందుశ్రీ ఎడవడం మొదలు పెట్టింది. గమనించి తల్లిదండ్రులు కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం లేదా హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. కూలి పని చేసుకునే వెంకటకృష్ణ డబ్బుల కోసం తిరిగేలోపే బిందుశ్రీ ప్రాణాలు విడిచింది. దీంతో వెంకటకృష్ణ, అశ్వినీ కన్నీరుమున్నీరయ్యారు. మొక్కజొన్న కంకులు తెచ్చి తమ బిడ్డ ప్రాణాలు తీసుకున్నామని వాపోతున్నారు.












Click it and Unblock the Notifications