కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ జగన్ శ్రీశైలం పర్యటన వాయిదా: వాతావరణంలో అనూహ్య మార్పులు: క్యుములోనింబస్?

|
Google Oneindia TeluguNews

శ్రీశైలం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పొంగిపొర్లుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి నుంచి మన రాష్ట్రంలోని ప్రకాశం బ్యారేజీ దాకా నిర్మించి ఆనకట్టలు, రిజర్వాయర్లన్నీ జలకళను సంతరించుకున్నాయి. వరద నీటితో పోటెత్తుతున్నాయి. వరదనీరు భారీగా వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం రిజర్వాయర్ గేట్లను ఎత్తేశారు అధికారులు. నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ సహా వరదనీటితో పోటెత్తుతోన్న కృష్ణానదీ పరీవాహక ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించ తలపెట్టిన పర్యాటన వాయిదా పడింది.

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం: భారీ పేలుడు: లోపలే 9 మంది: రెస్క్యూనకు ఆటంకంశ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం: భారీ పేలుడు: లోపలే 9 మంది: రెస్క్యూనకు ఆటంకం

వాతావరణం అనుకూలించకపోవడమే దీనికి ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. ఆయన షెడ్యూల్‌ను రద్దు చేసినట్లు వెల్లడిస్తున్నారు. వైఎస్ జగన్ మళ్లీ శ్రీశైలం పర్యటనకు ఎప్పుడు వెళ్తారనేది ఇంకా నిర్ధారించలేదని స్పష్టం చేస్తున్నారు. ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం..వైఎస్ జగన్ ఈ ఉదయం 11 గంటలకు శ్రీశైలానికి చేరుకోవాల్సి ఉంది. శ్రీశైలం రిజర్వాయర్‌ను సందర్శించిన తరువాత.. పోతిరెడ్డి పాడు విస్తరణ పనులు, రాయలసీమ ఎత్తిపోతల పథకం, వరద జలాలపై ఏపీ జెన్‌కో అతిథిగృహంలో జల వనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించాల్సి ఉంది.

AP Chief Minister YS Jagans Srisailam tour is postponed due to bad weather

సమీక్ష అనంతరం మధ్యాహ్నం 12:15 నిమిషాలకు కర్నూలు జిల్లాలో కృష్ణా వరద జలాల స్థితిగతులపై ఏరియల్ సర్వేను చేపట్టాల్సి ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు, వెలిగొండ హెడ్ రెగ్యులేటరీ పనులు, పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల ప్రాజెక్టు, బనకచర్ల లిఫ్ట్ ఇరిగేషన్, ముచ్చుమర్రి ఎత్తిపోతలు, కొత్తగా నిర్మించడానికి ప్రతిపాదించిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్థలం, మల్యాల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారని అధికారులు షెడ్యూల్‌ను రూపొందించారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల వైఎస్ జగన్ పర్యటన మొత్తం రద్దయినట్లు చెబుతున్నారు.

వాతావరణం హఠాత్తుగా ఏర్పడిన మార్పుల వల్ల ముఖ్యమంత్రి తన పర్యటనను వాయిదా వేసుకున్నట్లు చెబుతున్నారు. దట్టమైన నల్లమల అడవుల మీదుగా హెలికాప్టర్‌ ప్రయాణించాల్సి రావడం, అక్కడ వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల ప్రయాణం సాగించడం శ్రేయస్కరం కాదంటూ అధికారులు సూచించడంతో వైఎస్ జగన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నట్లు సమాచారం. మళ్లీ ఎప్పుడు శ్రీశైలం రిజర్వాయర్‌ను సందర్శించడానికి ఆయన వెళ్తారనేది ఇంకా తేలాల్సి ఉంది. వచ్చేనెల మొదటి వారంలో ఈ పర్యటన ఉండొచ్చని తెలుస్తోంది.

English summary
Proposed Srisail tour of Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy is postponed due to bad weather. The tour schedule will be announce later, source said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X