బాల సాయిబాబా కన్నుమూత
ప్రముఖ ఆధ్మాత్యిక గురువు బాలసాయి బాబా తుది శ్వాస విడిచారు. కర్నూలు జిల్లాకు చెందిన బాల సాయిబాబా 18 సంవ త్సరాల వయసులోనే తొలిసారి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసారు. అప్పటి నుండి కర్నూలు కేంద్రంగా ఆద్యాత్మిక కార్యక్రమా లు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది భక్లులు ఉన్నారు. బాల సాయిబాబా వివాదాస్పద అంశాల్లోనే కేంద్ర బిందువుగా మారారు.

అప్పట్లోనే అనేక కధనాలు మీడియాలో బాల సాయిబాబా పై ప్రసారమయ్యాయి. కడుపులో నుండి శివలింగం తీసే విద్య ద్వారా బాల సాయిబాబా ప్రాచుర్యం పొందారు. సోమవారం ఆర్దరాత్రం హైదరాబాద్ దోమలగూడ లో ఉంటున్న బాల సాయిబాబాబకు గుండెపోటు రావటంతో బంజారాహిల్స్ లోని విరించి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో చికిత్ప పొందుతూ ఆయన కన్నుమూసారు.












Click it and Unblock the Notifications