భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రాణాలకు ముప్పు.. భూమా అఖిలప్రియ
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రాణాలకు ముప్పు ఉందన్నారు. అదీ కూడా పోలీసుల చేత ఉందని చెప్పారు. ప్రజల కోసం తమ తండ్రి భూమా నాగిరెడ్డి బస్ షెల్టర్ కట్టించారని గుర్తుచేశారు. ఆ బస్ షెల్టర్ కూల్చివేతను తమ్ముడు అడ్డుకుంటే, అతనిపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు.
ఎలాంటి వర్క్ ఆర్డర్ లేకుండానే ప్రజల ఆస్తి అయిన బస్ షెల్టర్‌ను కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతను ప్రశ్నించిన తమ్ముడిపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. తన తమ్ముడు తప్పు చేస్తే తానే పోలీసుల వద్దకు తీసుకెళ్తానని చెప్పారు. ఆళ్లగడ్డలో అభివృద్ధి ముసుగులో అక్రమాలు జరుగుతున్నాయని అఖిలప్రియ ఆరోపించారు. ఈ అక్రమాలను సాక్ష్యాధారాల సహా నిరూపిస్తానని... నిరూపించలేకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.

ఇందుకు మీరు సిద్ధమేనా? అంటూ వైసీపీ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. ఆళ్లగడ్డలో జరుగుతున్న అక్రమాలపై రేపు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కూల్చివేతల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆమె చెప్పారు. బాధితులకు అండగా తాము నిలబడతామని అన్నారు. ఆళ్లగడ్డలో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య గొడవ జరుగుతుంది. అఖిలప్రియ ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. ఇదివరకు అంటే ఆమె తల్లి శోభ నాగిరెడ్డి బతికి ఉన్న సమయంలో వైసీపీలో ఉన్న సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అఖిలప్రియ ఫ్యామిలీ టార్గెట్ అయ్యింది.
వాస్తవానికి అఖిలప్రియ.. నేరుగా జగన్‌తో మాట్లాడే ర్యాపో ఉండేది. కానీ పార్టీ మారిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మళ్లీ వర్గ విభేదాలు గుప్పుమన్నాయి. ఈ సారి బస్ షెల్టర్ మీద వివాదం రాజుకుంది. అధికార పార్టీ వారే కూల్చివేయడానికి ప్రోద్బలం అందించారని ఆరోపించారు. అడ్డుకుంటే తిరిగి కేసులు పెడుతున్నారని కామెంట్ చేశారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications