కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాయలసీమలో రాజధాని పెట్టాలి .. లేదా ప్రత్యేక రాష్ట్రాని ఇవ్వాలి.. సీమవాసుల డిమాండ్ .. రీజన్ అదిరిందబ్

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ చేసిన ప్రకటన మూడు రాజధానుల అంశంపై ఏపీ అట్టుడికిపోతోంది. ఇక ఇదే సమయంలో ఒక కొత్త వాదన కూడా తెరమీదకు వచ్చింది. రాజధాని రాయలసీమలోనే ఏర్పాటు చెయ్యాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు రాయలసీమ వాసులు. ఒకపక్క అమరావతిలో రైతులు రాజధాని తరలించవద్దు అని ఉద్యమం చేస్తుంటే ఇక రాయలసీమ వాసులు రాజధాని తమ ప్రాంతంలోనే ఏర్పాటు చెయ్యాలని, లేదా ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు .

రాజధాని రైతుల ఆందోళనలు ఉధృతం ... నేడు జలదీక్షలు, గవర్నర్ తో భేటీ , వామపక్ష నేతల పర్యటనరాజధాని రైతుల ఆందోళనలు ఉధృతం ... నేడు జలదీక్షలు, గవర్నర్ తో భేటీ , వామపక్ష నేతల పర్యటన

 గతంలో రాయలసీమలోనే రాజధాని .. మాకు తిరిగివ్వండి అంటున్న సీమవాసులు

గతంలో రాయలసీమలోనే రాజధాని .. మాకు తిరిగివ్వండి అంటున్న సీమవాసులు

రాయలసీమ ప్రాంతం ఎంతో కాలంగా వెనుకబడి ఉండటం,గతంలో ఏపీ రాజధానిగా కర్నూలు ఉండటం, ఇక రాజధాని రాయలసీమే కావాలని దీనిపై పలువురు నేతలు పలు వ్యాఖ్యలు చేస్తున్నారు.రాజధాని కావాలని ఉత్తరాంధ్రా వాసులు ఎప్పుడు అడగలేదనీ, గతంలో రాయలసీమలోనే రాజధాని ఉండేదని రాయలసీమ వాసులు చెప్తున్నారు. రాయలసీమవాసులు మొదటినుంచి క్యాపిటల్ డిమాండ్ చేస్తున్నారనీ, అడిగినవారికి ఇవ్వకుండా అడగనివారికి ఇవ్వటమేంటి అంటూ సీనియర్ పొలిటీషియన్ మైసూరా రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు ఆయన చేస్తున్న వాదనే రాయలసీమ వాసులు వినిపిస్తున్నారు.

హైకోర్టు మాత్రమే కాదు రాజధాని ఇక్కడే అంటూ వాదన

హైకోర్టు మాత్రమే కాదు రాజధాని ఇక్కడే అంటూ వాదన


చాలా కాలంగా హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చెయ్యాలని ఉద్యమాలు చేస్తున్న కర్నూలు వాసుల డిమాండ్ తో పాటుగా, రాయలసీమలో రాజధాని ఏర్పాటు చెయ్యాలని, అందుకు రాయలసీమ అనుకూల ప్రాంతం అని, రాజధాని ఏర్పాటుతో అయినా రాయలసీమ అభివృద్ధి చెందుతుంది అని రాయల సీమ వాసులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే పాలకుల నిర్లక్ష్యానికి గురై వెనుకబడిన రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.

విశాఖ వాసుల్లో రాజధాని డిమాండ్ లేదు .. అక్కడ రాజధాని ఎందుకని ప్రశ్న

విశాఖ వాసుల్లో రాజధాని డిమాండ్ లేదు .. అక్కడ రాజధాని ఎందుకని ప్రశ్న

విశాఖకు పాలనా రాజధాని ఇస్తే రాయలసీమ నుంచి విశాఖకు సెక్రటేరియట్ కు వెళ్లాలంటే చాలా కష్టమని కాబట్టి సీమలోనే రాజధాని పెట్టాలని డిమాండ్ వినిపిస్తుంది. అసలు మాకు రాజధాని కావాలని అడగని చోట ఎందుకు రాజధాని ఏర్పాటు చేస్తున్నారో అర్ధం కావటం లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై త్వరలోనే రాయలసీమలోని నేతలందరితో సమావేశమై, కార్యాచరణ సిద్ధం చేస్తామని సీనియర్ పొలిటీషియన్ మైసూరా తెలిపారు.

రాయలసీమ వాసుల త్యాగాలకైనా రాజధాని ఇవ్వాల్సిందే

రాయలసీమ వాసుల త్యాగాలకైనా రాజధాని ఇవ్వాల్సిందే


తెలుగు రాష్ట్రం విడిపోయినప్పుడు కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందనీ..తరువాత అది పలు కీలక పరిణామాల మధ్య హైదరాబాద్ కు తరలిపోయిందనీ చెప్తున్న రాయలసీమ వాసులు ఇప్పుడు అమరావతి కాకుండా రాజధానుల ఏర్పాటుపై చర్చ సందర్భంగా తమ డిమాండ్ న్యాయమైనదని అంటున్నారు. గతంలో ఏపీకి రాయల సీమ ప్రాంతంలోని కర్నూలు రాజధాని కాబట్టి దాన్నే కొనసాగించాలని అంటున్నారు. రాయలసీమ వాసులు అప్పట్లో రాజధానినే త్యాగం చేశారు. కనుక రాయలసీమలోనే ఇప్పుడు రాజధాని కావాలంటున్నారు.

రాజధాని ఇవ్వండి లేదా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వండి.. లాజిక్ చెప్తున్న సీమ వాసులు

రాజధాని ఇవ్వండి లేదా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వండి.. లాజిక్ చెప్తున్న సీమ వాసులు

తెలంగాణ..ఏపీ విభజన తరువాత సీఎం అయిన చంద్రబాబు రాజధానిగా అమరావతిని ప్రకటించి రాయలసీమకు అన్యాయం చేశారు. ఇక ఇప్పుడు సీఎం జగన్ వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని ప్రకటించి మరోమారు రాయల సీమకు అన్యాయం చేస్తున్నారని, ఇద్దరూ సీమ వాసులే అయి వుండి రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు. రాజధాని ఇవ్వండి, లేదా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వండి అని అడుగుతున్నారు. ఏ విధంగా చూసినా రాజధానిగా రాయలసీమ కరెక్ట్ అని లాజిక్ మాట్లాడుతున్నారు సీమ వాసులు . ఇప్పుడు రాయలసీమ వాసులు చేస్తున్న డిమాండ్స్, దానికి వారు చెప్తున్న కారణాలు వింటే వారి వాదనలోనూ న్యాయం ఉంది అనిపిస్తుంది.

English summary
AP CM Jagan's statement on the topic of three capitals in AP created tensions in AP. At the same time a new argument also came up. Rayalaseema residents are demanding that the capital be established in Rayalaseema itself. On the one hand, farmers in Amaravati are protesting that the capital should not be moved, and that the Rayalaseema residents are demanding that the capital be established in their own region or they demanding a separate state
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X