కర్నూలు జిల్లాలో భూ ప్రకంపనలు: భయంతో ఇళ్ల నుంచి జనం పరుగులు

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాతనలో భూ ప్రకపంనలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు.

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో సోమవారం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తుగ్గలి మండలం రాతనలో భూ ప్రకపంనలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. భూ ప్రకంపనలతో భయాందోళనలకు గురైన ప్రజలు తమ తమ నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు.

ఈ భూకంపం ధాటికి గ్రామంలోని పలు ఇళ్లకు బీటలు వారినట్లు స్థానికులు తెలిపారు. రాతనలోని దాదాపు 15 ఇళ్లకు బీటలు వారగా, గ్రామంలోని పలు ప్రాంతాల్లో సీసీ రోడ్డుకు కూడా బీటలువారినట్లు స్థానికులు వెల్లడించారు.

Earthquake in Ratana village in kurnool district

భూ ప్రకంపనల సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి, పలువురు అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించారు. భూ ప్రకంపనల తీవ్రత ఏ స్థాయిలో నమోదైంది.. రిక్టర్ స్కేలుపై ఎంత మేర నమోదైందనేది విషయాలు తెలియాల్సి ఉంది.

కాగా, ఇటీవల భూకంపాలు ప్రపంచంలో వేలాది మంది ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. టర్కీ-సిరియా దేశాల్లో ఫిబ్రవరిలో చోటు చేసుకున్న భూకంపం కారణంగా 50 వేల మందికిపైగా ప్రజలు మరణించిన విషయం తెలిసిందే. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+