tagore kurnool nandyala private hospital death person nagaraju ఠాగూర్ మూవీ కర్నూలు నంద్యాల నాగరాజు మృతి
అచ్చం ఠాగూర్ సినిమా లాగే.. సర్జరీ పేరుతో ముక్కుపిండీ మరీ డబ్బూల్ వసూల్.. తీరా చూస్తే..
ఠాగూర్ సినిమాలో ఓ సీన్ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని గవర్నమెంట్ ఆస్పత్రిలో డెత్ సర్టిఫికెట్ తీసుకుంటాడు హీరో. తర్వాత అతనని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తే.. ట్రీట్‌మెంట్ పేరుతో డబ్బులు వసూల్ చేస్తారు. ముక్కు పిండీ మరీ తీసుకుంటారు. కానీ తీరా చనిపోయాడని వైద్యులు చెప్పేసరికి.. తనకు తెలుసు అని.. డెత్ సర్టిఫికెట్ ఇదిగో అని చూపిస్తుంటాడు. దీంతో ఆస్పత్రి యజమాన్యానికి దిమ్మతిరిగి మైండ్ బ్లాంకవుతోంది.

కాలికి దెబ్బ..
కర్నూలు జిల్లా కోయలకుంట్లకు చెందిన నాగరాజు కాలికి దెబ్బ తగిలింది. అతనిని నంద్యాలలో గల ఆస్పత్రికి తీసుకెళ్లారు. సర్జరీ పేరుతో డబ్బులు వసూల్ చేశారు. వాస్తవానికి వారు నిరుపేదలు.. అప్పో, సప్పో చేసీ మరీ అడిగిన డబ్బులను కట్టారు. అయితే సోమవారం ఆపరేషన్ చేస్తామని చెప్పి రూ.20 వేలు కట్టించుకున్నారు. కానీ ఆదివారం రాత్రి అతని ప్రాణాలు పోయాయి. దీంతో తీవ్ర ఆందోళన నెలకొంది.

కడుపు నొప్పి రావడంతో..
ఆదివారం రాత్రి 11 గంటలకు నాగరాజుకు కడుపునొప్పి వచ్చిందని అతని బంధువులు తెలిపారు. కానీ ఏ వైద్యుడు పట్టించుకోలేదని చెప్పారు. ఐసీయూకు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. గుండెపోటు వచ్చి.. ప్రాణాలు కోల్పోయాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు కోల్పోయారని వాపోయారు. తమను న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు.

ఏం జరిగిందంటే..
అయితే వైద్యులు మాత్రం ఇబ్బంది ఉంది అని కుటుంబ సభ్యులకు చెప్పామని పేర్కొన్నారు. కాలికి పెద్ద గాయం కావడంతో స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది అని తెలిపామని చెప్పారు. కానీ వారు వినిపించుకోలేదని.. తీరా తమపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. నాగరాజుకు అన్నీ బాగుంటే.. సర్జరీ జరిగే వరకు బాగుండే వారు కదా అని ప్రశ్నిస్తున్నారు.

చనిపోయినా.. డబ్బుల్... వసూల్....
అయితే వైద్యులు చెప్పేదీ తప్పు అని.. నాగరాజు చనిపోయిన తర్వాత కూడా డబ్బులు గుంజారని తెలిపారు. ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై నంద్యాల టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.