లోకేష్ కు తల్లి భువనేశ్వరి సర్ ప్రైజ్ గిఫ్ట్ - నందమూరి కటుంబంతో కలిసి..!!
లోకేష్ కు తల్లి భువనేశ్వరి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో పాదయాత్ర కొనసాగుతోంది. ఈ రోజు లోకేష్ యువగళం పాదయాత్ర వందో రోజుకు చేరింది. ఈ సమయంలో తల్లి భువనేశ్వరి కుమారుడుతో కలిసి అడుగులు వేసారు. నందమూరి కుటుంబం మద్దతుగా తరలి వచ్చింది. బోయరేవుల క్యాంప్ సైట్ నుండి 100 వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం పై పదునైన విమర్శలు..పరామర్శలతో లోకేష్ యాత్ర కొనసాగుతోంది.
100 రోజుల యాత్ర:రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పాదయాత్ర లక్ష్యంగా జనవరి 27న లోకేష్ కుప్పంలో తన యాత్ర ప్రారంభించారు. ఇప్పటి వరకు 34 నియోజకవర్గాల్లో 1269 కిలో మీటర్ల మేర యాత్ర పూర్తి చేసారు. అనేక వర్గాలకు చెందిన వారితో లోకేష్ మమేకం అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరామర్శల సమయంలో అండగా నిలుస్తానంటూ హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాను ఎండగట్టారు. స్థానిక ఎమ్మెల్యే అవినీతిని ప్రశ్నించారు. లోకేష్ యాత్రను ప్రతీ నియోజకవర్గంలో పార్టీ నేతలు ప్రతిష్ఠాత్మంగా నిర్వహిస్తున్నారు. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో యాత్ర పూర్తి చేసిన లోకేష్ ప్రస్తుతం కర్నూలు జిల్లాలో తన యాత్ర నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో తనయుడు కోసం తల్లి భువనేశ్వరి పాదయాత్ర శిబిరం వద్దకు వచ్చారు.

పాదయాత్రలో భువనేశ్వరి:ఆదివారం మదర్స్ డే కావటంతో లోకేష్ పాదయాత్ర నుంచి తన తల్లికి విషెస్ చెప్పారు. సాయంత్రం లోకేష్ తన పాదయాత్ర ముగించుకొని శ్రీశైలం నియోజకవర్గం బోయరేవుల క్యాంప్ సైట్ కి చేరుకొనే సమయాని కి తల్లి భువనేశ్వరి ప్రత్యక్షమయ్యారు. మదర్స్ డే నాడు తనయుడుకు ఈ విధంగా భువనేశ్వరి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ ఉదయం వందో రోజు యాత్ర పాదయాత్రలో పాల్గొన్న భువనేశ్వరి, నారా, నందమూరి కుటుంబసభ్యులు పొల్గొన్నారు. నారా భువనేశ్వరి కుమారుడితో కలిసి పాదయాత్రలో అడుగులు వేసారు. నందమూరి కుటుంబ సభ్యులు తరలి వచ్చారు. రెండు రాష్ట్రాలకు చెందిన టీడీపీ నేతలు లోకేష్ కు శుభాకాంక్షలు చెప్పారు. పాదయాత్రలో తల్లి షూకు లోకేష్ లేస్ కడుతూ కనిపించారు.
175 నియోజకవర్గాల్లోనూ:లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా 175 నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులు పాదయాత్రలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు టీడీపీ జాతీయ కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. అడ్డంకులు అధిగమిస్తూ, విశేష ప్రజాధరణతో ముందుకు సాగుతున్న నారా లోకేష్ యువగళం పాదయాత్రకు అభినందనలు. పాదయాత్ర ఈనెల 15వ తేదీన 100 రోజుల మైలురాయి చేరనుంది. ఈ సందర్భంగా అదే రోజున టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో సంఘీభావంగా పాదయాత్రలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గంలో 3 వేల మంది పార్టీ శ్రేణులతో 7 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వారి వారి నియోజకవర్గాలలో జరిగే సంఘీభావ పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ సూచించిందది.












Click it and Unblock the Notifications