• search
 • Live TV
కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కర్నూలును వెంటాడుతున్న గ్రహం...పొంచిఉన్న విపత్తులు తక్షణం చేయాల్సిందిదే..!

|

కర్నూలు: రాయలసీమ జిల్లాల నుంచి తెలంగాణకు ఎంటర్ కావాలంటే కర్నూలు జిల్లాను టచ్ చేయాల్సిందే. అంతేకాదు కర్నాటక రాజధాని బెంగళూరు నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాదుకు రోడ్డు మార్గం ద్వారా రావాలంటే కర్నూలు నగరంను కచ్చితంగా టచ్ చేయాల్సిందే. అందుకే రాయలసీమ జిల్లాలు తెలంగాణకు మధ్య ముఖద్వారంగా కర్నూలు నగరం అని చెబుతారు. ఇక కర్నూలు జిల్లాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆంధ్రదేశం తొలి రాజధానిగా కర్నూలు అనేది తెలిసిందే. కర్నూలు నగరం అనేక విపత్తులను ఎదుర్కొంది.. ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే కర్నూలు పేరును మార్చాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇంతకీ ఈ నగరానికి ఏమైంది..?

వరుస విపత్తులతో అల్లాడుతున్న కర్నూలు

వరుస విపత్తులతో అల్లాడుతున్న కర్నూలు

కర్నూలు నగరానికి ఏమైంది. వరుస విపత్తులు... ఒక్క కర్నూలు నగరంలోనే కాదు ఆ జిల్లా మొత్తం వరుస విపత్తులతో అల్లాడిపోతోంది. వరుస విపత్తులతో కర్నూలు నగరం అల్లాడిపోతోందంటే దీనికి కారణం ఆ జిల్లా పేరులోనే దోషం ఉందంటున్నారు జ్యోతిష్యులు. అవును కర్నూలు పేరులో దోషం ఉందని ఘంటాపథంగా చెబుతున్నారు జ్యోతిష్యుడు మొహ్మద్‌ ఖాన్. ఇందుకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. పేరులో వైబ్రేషన్స్ బలంగా లేవు కాబట్టే ఆంధ్రదేశంకు 1953 నుంచి 1956 వరకు రాజధానిగా ఉన్న కర్నూలు ఆ హోదాను కోల్పోయింది. జిల్లాలో రెండు జీవనదులు కృష్ణా నది, తుంగభద్ర నది పారుతున్నప్పటికీ ఆ నీటిని కర్నూలు జిల్లా వినియోగించుకోలేకపోతోందని చెప్పారు. అంతేకాదు కర్నూలు జిల్లా నుంచి ఇతర జిల్లాలకు కార్మికులు వలసపోతున్నారంటే అందుకు కారణం కర్నూలు అనే పేరే అని ఖాన్ చెబుతున్నారు. సరైన పేరు ఉంటే జాతకరీత్య జిల్లా అన్ని నెగిటివ్ విషయాలను అధిగమిస్తుందని చెబుతున్నారు.

 పేరుమార్చకుంటే చేదు ఫలితాలే

పేరుమార్చకుంటే చేదు ఫలితాలే

ఈ రోజు కర్నూలు అని పిలుచుకుంటున్న నగరంకు తొలిపేరు కందనవోలు అని గుర్తు చేశారు ఖాన్. ఇక కర్నూలు పేరు మార్చకుంటే అనుకున్న ఫలితాలు ప్రభుత్వానికి రావని ఖాన్ తేల్చేశారు. కర్నూలు పేరుతోనే కొనసాగిస్తే న్యాయరాజధానిగా కర్నూలు అనుకుంటున్న ప్రభుత్వానికి చేదు అనుభవాలే మిగలొచ్చు అని ఆయన జోస్యం చెబుతున్నారు. ఇక ఇంత బలంగా బల్లగుద్ది మరీ చెబుతున్న ఈ మొహ్మద్ ఖాన్ గొప్ప జ్యోతిష్యుడిగా పేరుంది. ఈయన ఆస్ట్రాలజీతో పాటు సంఖ్యాశాస్త్రంను కూడా జోడించి జాతకం చెబుతారని ప్రసిద్ధి. ఖాన్‌ కోసం సినీనటులు, రాజకీయనాయకులు, బడా పారిశ్రామికవేత్తలు వచ్చి కలిసిపోతుంటారని వారి జాతకాలను చూపించుకుంటూ ఉంటారని చెబుతుంటారు.

పేరు మార్పునకు ప్రభుత్వంపై ఒత్తిడి

పేరు మార్పునకు ప్రభుత్వంపై ఒత్తిడి

సంఖ్యాశాస్త్ర పరంగా చూస్తే 2020వ సంవత్సరం కుజుడుపై భారంగా కనిపిస్తోందని ఖాన్ చెప్పారు. కర్నూలు నగరం కూడా చాలా బలహీనంగా కనిపిస్తోందని చెప్పారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా బాగుండాలంటే ఈ జిల్లా నుంచి ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు కర్నూలు పేరును కందనవోలుగా మార్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ఇదిలా ఉంటే కందనవోలు అనేది కర్నూలు పూర్వనామం అని చరిత్రకారుడు డాక్టర్ మద్దయ్య చెబుతున్నారు.

  TikTok Users Beware, TikTok Addiction Leads To Lost Life
   చరిత్రకారులు ఏం చెబుతున్నారు..?

  చరిత్రకారులు ఏం చెబుతున్నారు..?

  కర్నూలు నగరంలో వరుస విపత్తులు వచ్చిన మాట వాస్తవమే అని డాక్టర్ మద్దయ్య చెప్పారు. 1916, 1992, 1999,2009లో వచ్చిన వరదలు కర్నూలు నగరానికి తీరని నష్టంను చేకూర్చాయని చెప్పారు. 12వ శతాబ్దంలో ప్రస్తుతం తెలంగాణలో ఉన్న అలంపూర్‌లోని తుంగభద్ర తీరంలో ఒక ఆలయం నిర్మించాలని భావించారట. ఆ సమయంలో కర్నూలు నుంచి ఎడ్ల బండ్లపై రాళ్లను తరలించారట. ఎడ్లబండ్లకు ఉండే చక్రాలకు కందనం అంటే గ్రీసును పూసేవారట. ఈ కందనంను అప్పటి కందనవోలులోని వ్యాపారుల నుంచి కొనుగోలు చేసేవారని మద్దయ్య చెప్పారు. ఈ క్రమంలోనే ఈ ప్రాంతాన్ని కందనవోలు అని పిలిచేవారని కాలక్రమంలో ఆపేరు కర్నూలుగా రూపాంతరం చెందిందని మద్దయ్య చెప్పారు. కందనవోలు అంటే కందనంతో కూడిన గ్రామం అని మద్దయ్య చెప్పారు. ఇక కర్నూలు నగరం బళ్లారి,ఆదోని, హైదరాబాదుకు జంక్షన్‌గా వ్యవహరిస్తోంది.

  English summary
  With disasters like floods and Covid-19 hitting Kurnool, astrologer Mohammad Khan says that the name Kurnool needs to be changed to Kandanavolu as the former is inherently defective.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X