జనం మార్పు కోరుకుంటున్నారు.. బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం..?: జేపీ నడ్డా
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. 'జనం గోస-బీజేపీ భరోసా' బహిరంగ సభలో పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు చూడాలని అనుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్‌ను తీసుకొస్తామన్నారు. దుబ్బాక, హుజురాబాద్‌లో బీజేపీ ప్రభంజనం సృష్టించిందని తెలిపారు.
కేసీఆర్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని జేపీ నడ్డా అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సీఎం కేసీఆర్ ఏటీఎంగా మారిందని విమర్శించారు. మిషన్ భగీరథలో కూడా అవినీతికి పాల్పడ్డారని జేపీ నడ్డా కామెంట్ చేశారు. పాలమూరు బహిరంగ సభలో నడ్డా పాల్గొన్నారు. అంతకుముందు బండి సంజయ్ మాట్లాడారు. టీఆర్ఎస్‌తోపాటు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ ఏం చేస్తారని అడిగారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒక్కటేనని కామెంట్ చేశారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. నిరుద్యోగం, డబుల్ బెడ్ రూం ఇళ్ల గురించి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. పాలమూరును దత్తత తీసుకుంటామని చెప్పి.. కొందరు నేతలు పత్తా లేకుండా పోయారని విమర్శించారు. ఆర్డీఎస్ సమస్యను పరిష్కరిస్తామని కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్ హామీ ఇచ్చారని బండి సంజయ్ తెలిపారు.
ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి అనుకూలంగా ఉందని వివరించారు. తమ పార్టీకి అధికారం చేపట్టేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఇదే విషయాన్ని బండి సంజయ్, జేపీ నడ్డా ప్రస్తావించారు. టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు. అందుకోసమే జనం ప్రత్యామ్నాయంగా ఉన్న తమ వైపు చూస్తున్నారని వివరించారు.
తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ప్రధాని మోడీకి ఎప్పుడూ ఉంటుందని నడ్డా అన్నారు. కరోనా సమయంలో తమ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది. విదేశాల సాధ్యం కానీ విధంగా 130 కోట్ల మంది దేశ ప్రజలకు వ్యాక్సిన్లు సరఫరా చేశామని అన్నారు. ఇతర దేశాలకు కూడా పంపిణీ చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల పాటు దేశంలోని పేద ప్రజలకు ఉచితంగా రేషన్ ఇచ్చింది. ఆయుష్మాన్ భారత్ పథకంపై దేశమంతా సంతోషంగా ఉంటే.. అందులో చేరేందుకు కేసీఆర్ నిరాకరించారు. అవినీతిలో తెలంగాణ సర్కారు దేశంలోనే అగ్రస్థానంలో ఉందని నడ్డా దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications